గుర్తుతెలియని వ్యక్తి మృతి… విచారిస్తున్న పోలీసులు

 

గుర్తుతెలియని వ్యక్తి మృతి… విచారిస్తున్న పోలీసులు

వెల్దుర్తి అక్టోబర్ 24 అఖండ భూమి వెబ్ న్యూస్

కర్నూలు జిల్లా, వెల్దుర్తి మండలం మరియు గ్రామ శివారులలో శ్రీ ఎల్లమ్మ గుడి వెనుక వైపు సర్వే నెంబరు 328-1 నందు గల బెస్త పెద్ద రామాంజనేయులు యొక్క పొలములో గల రేగి చెట్టుకు గుర్తు తెలియని మగ వ్యక్తి ఉరి వేసుకుని చనిపోయినాడు. మృతుని వయసు సుమారుగా 28 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండవచ్చును. అతను సుమారు 5.3 అడుగుల ఎత్తు కలిగి ఉన్నాడు. అతని ఒంటిపై సగం ఎర్రని మరియు సగం నలుపు,తెలుపు చారలు గల మొలతాడు తప్ప ఎలాంటి దుస్తులు లేవు. కుడి వైపున ఛాతి క్రింద ఒక నల్లని పుట్టు మచ్చ, కుడి వైపున పొట్టపై ఒక నల్లని పుట్టుమచ్చ, ఎడమవైపు భుజంపై ఒక నల్లని పుట్టు మచ్చ కలవు. మృతుడి ఎడమవైపు చాతి క్రింద పాత గీకుడు గాయం కలదు. మృతుడు రెండు డ్రాయర్లకు సంభందించిన ఎలాస్టిక్ బెల్టులతో చెట్టుకొమ్మకు మరియు అతని మెడకు కట్టుకొని ఉరి వేసుకున్నట్లు ఉన్నది. సదరు డ్రాయర్ల ఎలాస్టిక్ బెల్టులను పరిశీలించగా అందులో ఒకటి నశం కలర్ కలిగి ఉండి దానిపై క్రీం కలర్ తో (COZI LUX) అను ఇంగ్లీషు అక్షరాలు ఉండి దాని క్రింద ఎర్రని లైను కలదు. మరొక ఎలాస్టిక్ బెల్ట్ ను పరిశీలించగా అది బ్లాక్ కలర్ లో ఉండి దానిపై బూడిద రంగుతో (MACHO) అను ఇంగ్లీషు అక్షరాలు కలవు. ఇక చెట్టు కింద మరియు చెట్టు పైన ఒక కొమ్మపై అతను తనకు సంబంధించిన దుస్తులను మరియు అతనికి సంబంధించిన ఇతర వస్తువులను కాల్చినట్లుగా అక్కడ బూడిద పడి ఉన్నది. అతని గొంతు చుట్టూ డ్రాయర్ల ఎలాస్టిక్ బెల్టులతో ఉరి వేసుకోవడం వలన ఏర్పడిన కందుడు గాయాలు ఉన్నాయి. ఇక శరీరంపై ఎక్కడ కూడా ఎలాంటి గాయాలు లేవు. చుట్టుపక్కల అంత వెతికినా కూడా అతనికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు గాని అతని వివరాలు గానీ తెలియలేదు. కావున మృతుని వివరాలు తెలిసినవారు వెల్దుర్తి పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారి ఫోన్ నెంబర్ 9121101118 కు సమాచారం ఇవ్వగలరు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!