జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన పేడాడ,
నరసన్నపేట అఖండ భూమి నవంబర్ 2 కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గా గురువారం పేడాడ పరమేశ్వరరావు బాధ్యత స్వీకరించారు మాజీ అధ్యక్షులు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు బొడ్డేపల్లి సత్యవతి నుండి జిల్లా కేంద్రం శ్రీకాకుళం విజ్ఞాన కేంద్ర భవనంలో ఆమె ఆయనకు బాధ్యతలు అప్పగించారు ఈ సందర్భంగా పరమేశ్వరరావు మాట్లాడుతూ ఒక ఉన్నతమైన బాధ్యతను అప్పగించిన అధిష్టానం సూచనలు ఆశీస్సులు మేరకు జిల్లా నలుమూలలో ఉన్న సీనియర్ జూనియర్ పార్టీ నాయకులతో చర్చించి వారి సూచనలను పాటించి పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఆయన అన్నారు ఎంతో దశాబ్దాలు చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో పని చేయడం ఎందరో మహానుభావులు రాష్ట్రం దేశం కోసం అనేక అభివృద్ధి సంక్షేమలు చేపట్టి మహోన్నత వ్యక్తులుగా నేటికీ మనలో ఉన్నారని అటువంటి పార్టీ అధ్యక్షులుగా నేను పని చేయడం పూర్వజన్మ అదృష్టమే కారణమని పరమేశ్వర అన్నారు ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు జిల్లా కార్యవర్గ సభ్యులు జిల్లా నలుమూలల నుండి వచ్చిన అభిమానులు పాల్గొన్నారు
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



