నాతవరం మండలం డి. యర్రవరం గ్రామం సమీపంలో ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదం లో ట్రాక్టర్ డ్రైవర్ అక్కడకక్కడే మృతి చెందగా ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల వివరాల ప్రకారం ములగపూడి గ్రామానికి చెందిన లక్ష్మణ అర్జున (23) అనే వ్యక్తి చాలాకాలంగా ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. దుక్కి దున్నటానికి వెళ్లి పని ముగించుకుని తిరిగి వస్తుండగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడటం తో లక్ష్మణ అర్జున ట్రాక్టర్ కింద ఉండిపోవటం తో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. నాతవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
You may also like
అట్రాసిటీ కేసులలో దళితులకు అన్యాయం జరిగితే సహించబోము .. మాల మహానాడు అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు టి. శ్రీనివాసరావు
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
కోతముక్కపేకాటపై పోలీసుల దాడి


