ప్రైవేటు పాఠశాలలలో సామర్థ్య వ్రాత పరీక్షలు.. వెల్దుర్తి నవంబర్ 03 (అఖండ భూమి) : మండల కేంద్రమైన వెల్దుర్తి పట్టణం నందు శుక్రవారం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న స్టేట్ ఎడ్యుకేషన్ అచీవ్మెంట్ సర్వే 2023 (ఎస్ ఈ ఏ ఎస్) నిర్వహణలో భాగంగా వెల్దుర్తి ప్రైవేట్ పాఠశాలల నందు విద్యార్థులతో సామర్థ్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ సామర్ధ్య పరీక్షలకు ఎంఈఓ ఇందిరా హాజరై పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంఈఓ విద్యార్థులతో మాట్లాడుతూ సామర్థ్య పరీక్షలు ఏ విధంగా రాస్తున్నారో విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాలల పరిసర ప్రాంతాలలో మౌలిక వసతులు విద్యార్థులకు ఏ విధంగా నిర్వహించారు. పాఠశాలల యజమానులను అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా స్వయంగా పర్యవేక్షణ చేసి పరిశీలించడం జరిగింది. విద్యార్థులకు వసతులు, ఆటల పరికరాలను సక్రమంగా ఏర్పాటు చేసి వారి యొక్క వ్యాయామ ఉల్లాసాలకు సహకరించాలని సూచించారు. విద్యార్థులలో అభ్యాసన ఫలితాలను అంచనా వేసేందుకు తెలుగు ఇంగ్లీష్ గణిత శాస్త్రాలలో వారి యొక్క ప్రావీణ్యతను వెలికి తీసేందుకే పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఎంఈఓ తెలిపారు. ఈ పాఠశాలలతో పాటు జిల్లా పరిషత్ పాఠశాలల సైతం తనిఖీలు నిర్వహించడం జరిగింది. ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు ఉన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,


