మూడు రోజులుగా విద్యాశాఖ ఔట్ సోర్సింగ్, అంగన్వాడీల నిరవధిక సమ్మె

 

 

మూడు రోజులుగా విద్యాశాఖ ఔట్ సోర్సింగ్, అంగన్వాడీల నిరవధిక సమ్మె

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం, అఖండ భూమి:

రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహనరెడ్డి ఎన్నికల ముందు ఎస్.ఎస్.ఎ కాంట్రాక్టు ఉద్యోగులు సి.ఆర్.ఎం.టి.లకు, ఎం.ఐ.ఎస్, సి.ఓ.లకు ఇచ్చిన హామీ ప్రకారం రెగ్యులర్ చేయాలని, తక్షణమే గ్రాస్ పే, ఎం.టి.ఎస్, డి.ఏ, హెచ్.ఆర్.ఏ. అమలుచేసి, వేతనం పెంచాలని, పార్ట్ టైం ఉద్యోగుల హోదా పెంచి ఫుల్ టైం ఉద్యోగుల విధానాన్ని అమలు చేసి వేతనాలు పెంచాలని, పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలని, ప్రతి నెల ఒకటో తేదీ వేతనాలు చెల్లించి, సంవత్సరానికి సరిపడే బడ్జెట్ ఒకేసారి విడుదల చేయాలనే 16 న్యాయమైన డిమాండ్ల సాధన కోసం, జిల్లా సమగ్ర శిక్ష కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా, విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదురుగా మూడవ రోజు శుక్రవారం నిరవధిక సమ్మె దీక్షను చేపట్టారు. వేతనంతో కూడిన మెడికల్ లీవులు మంజూరు చేయాలని, మెరుగైన హెల్త్ స్కీములు అమలు పరచాలని, సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను, ఉద్యోగ విద్యాశాఖలో విలీనం చేసి, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ జిల్లా 19 మండలాల నుంచి సుమారు 300 మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్.టి.యు. జిల్లా అధ్యక్షుడు జె.డానియల్ బాబు, జిల్లా ఉద్యమ నాయకులు డి.వి.కృష్ణంరాజు, ఎం.రఘునాథ్, సి.ఐ.టి యు. జిల్లా ఉపాధ్యక్షులు టి.అరుణ్,ఎస్ఎస్ మూర్తి, జిల్లా కోశాధికారి కె. ఎస్.ఎస్.వి.రామచంద్రరావు, జిల్లా నాయకులు పవన్, బి. రాజులోవ, హాస్పిటల్స్ యూనియన్ కార్యదర్శి శ్రీను, అంగన్వాడీ కార్యకర్తలు సునీత, డి. రామలక్ష్మి తదితర సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు, ఈ కార్యక్రమంలో పాల్గొని సమ్మె శిబిరానికి సంఘీభావాన్ని తెలిపారు. న్యాయమైన డిమాండ్లు సాధించే వరకు నిరవధిక సమ్మె కొనసాగిస్తామని, ప్రభుత్వం తక్షణమే తమ డిమాండ్లు నెరవేర్చి ఉద్యోగ భద్రత కల్పించాలని, సమగ్రశిక్ష వివిధ శాఖల ఉద్యోగులు ఎం రఘునాథ్ ఎం మిరపరాజు ఆర్ వెంకట్రావు కే చంద్రకుమార్ ఏ వీరపండు జి బాలకృష్ణ ప్రసాద్ తదితరులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. పులగుర్త డ్రాయింగ్ టీచర్ ఎన్.రత్నకుమార్ ఉద్యమ శిబిరంలో విశేషంగా అలరించాయి.

Akhand Bhoomi News

error: Content is protected !!