డేటా ఎంట్రీ ఆపరేటర్ వాసుదేవ్ వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరించాలి 

 

 

డేటా ఎంట్రీ ఆపరేటర్ వాసుదేవ్ వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరించాలి

 

అచ్యుతాపురం డిసెంబర్ 24 (అఖండ భూమి ) : సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు గత వారం రోజులుగా సమ్మెబాట పట్టారు దీనిలో భాగంగా అనకాపల్లి జిల్లా విద్యాశాఖ కార్యాలయం వద్ద నిన్న ధర్నా శిబిరం వద్ద మునగపాక మండల విద్యాశాఖ కార్యాలయం చెందిన డేటా ఎంట్రీ ఆపరేటర్ వాసుదేవ్ కి బ్రెయిన్ స్ట్రోక్ రావడం జరిగింది. దీంతో అతని తోటి ఉద్యోగులు అనకాపల్లిలో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు అతనికి వైద్యం నిమిత్తం అత్యధికంగా ఖర్చవుతుందని హాస్పటల్ సిబ్బంది చెప్పారు. సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఎటువంటి హెల్త్ బెనిఫిట్ ప్రభుత్వం నుంచి లేకపోవడంతో ఆయన కుటుంబం ఆందోళనలో ఉంది దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆ ఉద్యోగికి అయ్యే ఖర్చులు అన్నిటిని ప్రభుత్వమే భరించాలని అదేవిధంగా ఆయనకు మెరుగైన వైద్యాన్ని అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లుగా ఏపీ సిపిఎస్ ఈఏ అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి మోటూరు త్రినాధ స్వామి తన ప్రకటనలో పేర్కొన్నారు

Akhand Bhoomi News

error: Content is protected !!