నేడు క్రిస్మస్
పెద్ద దోర్నాల డిసెంబర్ 24 అఖండ భూమి
క్రైస్తవులకు ఆరాధ్యమైనది క్రిస్మస్ పండుగ. ఎంతో భక్తిశ్రద్ధలతో ఈ పండుగలు జరుపుకుంటారు. లోక పాపుల రక్షణార్థమై దేవుడే మానవుని రూపములో కుమారుడు గా జన్మించి పాపులను రక్షించి పరలోక రాజ్యానికి వారసులను చేస్తాడు. ఆ దేవాది దేవుడు భూలోకంలో జన్మించటంతో భూమి మీద ఆయన ఇష్టులైన వారికి సమాధానం శాంతి సంతోషం కలిగింది.
క్రిస్మస్ అనగా ఆరాధన. క్రిస్మస్ అనగా క్రీస్తు జన్మించుట. ఏసుక్రీస్తు ప్రభువారు పుట్టి విశేషమైన బోధనలు ప్రతి ఒక్కరి జీవితాలకు ఆచరణీయం. క్రీస్తు జన్మను గూర్చిన సాక్ష్యం గమనిస్తే కాళ్లు కళ్ళు లేని నక్షత్రం జ్ఞానులను క్రీస్తు వద్దకు తీసుకెళ్లింది. పరలోక సైన్య సమూహమైన దూతలు క్రీస్తును గూర్చిన వర్తమానం అందించి దేవునికి స్తోత్రం చేశారు. క్రీస్తు జన్మను ప్రచురం చేసిన వారిలో గొర్రెల కాపరులు ప్రధానంగా ఉన్నారు జ్ఞానులు ఆరాధించి మరో ఒక మార్గమును పోయి క్రీస్తును గూర్చిన సమాచారం అందించారు తండ్రి అయిన దేవుడు ఏదైనా కుమారుడని ఈయన యందు ఆనందించుచున్నానని చెప్పెను. పేతురు ఆయన మహిమను కనులారా చూసి సాక్ష్యం ఇచ్చాడు. చూపు పొందిన గుడ్డి వారు ఒకటి నేను ఎరుగుదును ఒకప్పుడు నేను గుడ్డివాడినై ఉంటిని. ఇప్పుడు చూస్తున్నాను. సమరయ స్త్రీ నేను చేసిన వెంటనే నాతో చెప్పిన వానిని నేను చూపించెదను ఈయన క్రీస్తు కాడ? అని సాక్ష్యం ఇచ్చెను. క్రీస్తును పక్కలో పడిచిన రాణువ వాడు ఈయన నిజముగా దేవుని కుమారుడు సాక్ష్యం పలికను. ఇంతటి కరుణామయుడైన ఏసుక్రీస్తును ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలని పరిశుద్ధ బైబిలు గ్రంథం చెబుతుంది
ఫోటో:- ఏసుక్రీస్తు జన్మ
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..