బాలానగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
బాలానగర్ చౌరస్తాలో 6 మంది దుర్మరణం
సంత దినం కావడంతో భారీ రోడ్డు ప్రమాదం
ఆటో, బైకును ఢీకొన్న డీసీఎం వాహనం
మృతులు మోతి ఘనాపూర్ వాసులు
వారం సంత దినం కావడంతో కూరగాయలు, సరుకుల కోసం వచ్చిన గ్రామీణులు తిరుగు ప్రయాణంలో ఆటోలో వెళుతుండగా డీసీఎం వాహనం అతివేగంగా ఢీకొంది. ఇందులో 6 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలవగా బైక్ పై వెళ్తున్న మరొకరికి తీవ్ర గాయాలై ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టు స్థానికులు తెలిపారు. ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలోని చౌరస్తాలో చోటు చేసుకోవడం బాధాకరం. సంతదినం కావడంతో అక్కడ చౌరస్తాలో పోలీసు సిబ్బంది కూడా పర్యవేక్షణ లేకపోవడంతో ఈ ప్రమాదానికి కారణంగా స్థానికులు భావిస్తున్నారు. మృతులంతా మండలంలోని మోతి ఘనాపూర్ గ్రామానికి చెందిన వారని స్థానికులు చెప్పారు. మృతుల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సంఘటనలో చిన్న పిల్లలు సైతం ప్రమాదానికి గురై మృత్యువాత పడడంతో ఈ హృదయ విదారక దృశ్యాలు చూసి స్థానికులు బోరున విలపిస్తున్నారు డీసీఎం వాహనం హైదరాబాద్ నుండి జడ్చర్ల వైపు వెళుతుండగా నడి చౌరస్తాపై ఆటోను అత్యంత వేగంగా ఢీకొన్నట్టు స్థానికులు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అదేవిధంగా బైక్ పై మరో వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టు కూడా చెబుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన ఇంకా పూర్తి వివరాలు మరికాసేపట్లో తెలుస్తాయి. ప్రస్తుతం శవాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి..
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…



