నాతవరం మండలం గునుపూడి గ్రామానికి చెందిన ఉదయ్ అనే మూడు సంవత్సరాల బాలుడు రెండు కిడ్నీలు పాడై కొంత కాలంగా బాధపడుతుండడం తో చికిత్స నిమిత్తం ఆసుపత్రి లో చేర్పించారు. బాధిత కుటుంబం ఆర్థిక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో పాస్టర్ శాలేమ్ రాజు ఆధ్వర్యం లో క్రైస్ట్ చర్చ్ సంఘ సభ్యులు బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు.

ఈ సందర్భం గా పాస్టర్ శాలేమ్ రాజు మాట్లాడుతూ వైద్యానికి చాలా ఖర్చు అవుతుందని ఇంకా దాతలు ఎవరైనా ఉంటే ఫోన్ పే నెంబర్ 8465819735 కి సహాయం చేసి నిరుపేద కుటుంబానికి అండగా నిలవాలని కోరారు.



