సోమవరం రామాలయ అభివృద్ధి కై 20 వేలు విరాళాన్ని అందించిన అనకాపల్లి వైసీపీ ఇంఛార్జ్ మలసాని భరత్..

కశింకోట. జనవరి 21. (అఖండ భూమి)

కశింకోట మండలం లోని సోమవారం గ్రామంలో శ్రీ సీతారాముల సంబరాలు అంగరంగవైభవం గా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అనకాపల్లి నియోజక వర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మలసాల భరత్ పాల్గొన్నారు. రామాలయ అభివృద్ది కై 20 వేల రూపాయల విరాళాన్ని గ్రామ ప్రజలకు అందించారు. అంతే కాకుండా ఎల్లప్పుడూ గ్రామ ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ ప్రతి విషయంలోనూ సహకరిస్తానని గ్రామ ప్రజలకు మాటిచ్చారు.ఈ సందర్భం గా గ్రామ ప్రజలు మలసాని భరత్ కు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌతు నాగ అప్పలనాయుడు మాట్లాడుతూ ప్రజలకు అండగా నిలబడే నాయకులను గెలిపించుకోవడం మన బాధ్యత అని, సంక్షేమాభివృద్ధి కై మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధిక మెజారిటీతో గెలిపించుకోవాలని ప్రతీ కార్యకర్త ఒక సైనికునిలా పార్టీ విజయానికి కృషి చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గుర్రం ఆదినారాయణ, కరణం కృష్ణ, బాబురావు, సంజీవ్, నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు

Akhand Bhoomi News

error: Content is protected !!