
ఆంధ్ర ప్రదేశ్ తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్రం లోని అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేసి ఎలక్షన్ కమీషన్ తన వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసింది. గతేడాది విడుదల చేసిన జాబితా పై భారీగా పిర్యాదులు రావడం తో తాజా గా విడుదల చేసిన జాబితా పై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.



