తుని నియోజక వర్గం కాకరాపల్లి లో వైసీపీ కి ఎదురుదెబ్బ!

తుని అసెంబ్లీ నియోజక వర్గంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తెలుగుదేశం పార్టీలోకి వలసలు జోరు అందుకుంటున్నాయి. నిన్న మొన్నటి వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా నిలిచిన కాకరాపల్లి లో అధికార పార్టీకి బీటలు వారుతున్నాయి. కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఇవాళ జయహో తెలుగుదేశం అంటూ యనమల నాయకత్వానికి జై కొట్టారు. వైసీపీ కి పార్టీకి గుడ్ బై చెప్పిన సర్పంచ్ బంటుపల్లి వెంకటేశ్వరరావు, అనుచరులు, వార్డు సభ్యులు, గ్రామ నాయకులతో‌ సహా తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరంతా  తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి యనమల కృష్ణుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. సర్పంచ్ బంటుపల్లి వెంకటేశ్వరరావు‌, ఆయన అనుచరులు, వార్డు సభ్యులు, గ్రామ నాయకులకు శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు పసుపు కొండవాలు కప్పి  తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి యనమల దివ్య గెలుపు కోసం కృషి చేయాలని పార్టీ కోసం కష్టపడే వారికి తగిన గుర్తింపు ఇచ్చి సముచిత స్థానం కల్పిస్తామన్నారు.

బంటుపల్లి వెంకటేశ్వరరావు తో పాటు వార్డు సభ్యులు కీర్తి రాము, కీర్తి సత్తిబాబు, సంపంగి తాతీలు, పెనుమత్స గణేష్, భవన నిర్మాణ సంఘం అధ్యక్షుడు కొంకిపూడి వీరబాబు కోలా సత్యనారాయణ, కీర్తి ప్రసాదరావు, వాసం కొండయ్య, కీర్తి శివ, వేవారపు సత్యనారాయణ, కీర్తి సత్యనారాయణ, పిల్లి వీర్రాజు, నక్క వెంకట రమణ, నక్క లోవరాజు, ములికి అప్పారావు, గజ్జల నాగరాజు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో టీడీపి నాయకులు మోతుకూరి వెంకటేష్, కోటనందూరు మండల టీడీపి అధ్యక్షులు గాడి రాజబాబు, కోటనందూరు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి లెక్కల భాస్కర్ పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!