జనసేన పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ రాజాన వీర సూర్యచంద్ర పిలుపునిచ్చారు. సోమవారం నర్సీపట్నం ఎన్జీవో హోం లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ఆశయాలు, జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు వివరించాలన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన టిడిపి కూటమి విజయానికి అందరూ కృషి చేయాలన్నారు. ప్రతి మండలంలో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు అధికారులకు తెలియజేస్తూ వాటి పరిష్కారానికి చొరవ చూపాలన్నారు.
ఈ కార్యక్రమంలో నర్సీపట్నం టౌన్ అద్దేపల్లి గణేష్, గొలుగొండ మండల అధ్యక్షులు గండం దొరబాబు, నాతవరం మండలం అధ్యక్షులు వెలగల వెంకటరమణ, నర్సీపట్నం రూరల్ అధ్యక్షులు మోపాడు చిరంజీవి, జిల్లా కార్యదర్శి నమ్మి రమణ రాజు, ఎస్సీ సెల్ నియోజకవర్గం కన్వీనర్ డాక్టర్ కోన నారాయణరావు, బైన మురళి, కులం మండల ఎస్సి సెల్ అధ్యక్షులు బోయిన చిరంజీవి, ప్రోగ్రాం కమిటీ నెంబర్ కొత్తకోట రామశేఖర్, టౌన్ నాయకులు మారిశెట్టి రాజా తదితరులు పాల్గొన్నారు.
You may also like
అప్రెంటిస్షిప్ చట్టం ప్రకారం వేతనం తప్పనిసరి.. హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షులు:- నారాయుడు
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్