కొరుప్రోలులో భారీ చోరీ.

 

 

కొరుప్రోలులో భారీ చోరీ.

తాళాలు వేసున్న ఇంటికి కన్నం వేసిన దొంగలు.

పదకొండు తులాల బంగారు ఆభరణాలు, ఇరవై తులాల వెండి, అరవై వేలు నగదు మాయం.

అనకాపల్లి జిల్లా.. అఖండ భూమి… న్యూస్ .ఫిబ్రవరి . 9

ఎస్ రాయవరం

మండలంలోని కొరుప్రోలు గ్రామంలో భారీ చోరీ జరిగింది. తాళాలు వేసినవి వేసినట్లుండగానే ఎవరూ లేని సమయం చూసి దొంగలు హస్తలాఘవం చూపించారు. వివరాల్లోకి వెళితే కొరుప్రోలు గ్రామం బిసి కాలనీకి చెందిన పినపాతృని నాగలక్ష్మి రెండు రోజుల క్రితం తన బంధువుల ఇంటికి విశాఖపట్నం వెళ్ళింది.శుక్రవారం సాయంత్రం ఇంటికి వచ్చి చూసేసరికి వేసిన గేటు తాళం వేసినట్లుగానే ఉండగా,లోపలి గదికి వెళ్ళే తాళాలు పగలగొట్టబడి ఉన్నాయి. లోపలికి వెళ్ళి చూడగా బీరువా

 

తాళాలు తెరచి ఉండగా అందులో చీటీ పాడి పెట్టిన అరవైవేల రూపాయల నగదు,మూడున్నర తులాల నక్లెస్, మూడున్నర తులాల నల్లపూసలు,మూడుతులాల రెండు చైనులు, అరతులం ఉంగరం,అరతులం చెవిదిద్దులు, ఇరవై తులాల వెండి వస్తువులు కనపడలేదని నాగలక్ష్మి తెలిపారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అనకాపల్లి నుండి క్త్రెం సబ్ ఇన్స్ పెక్టర్ నరసింహారావు బృందం వచ్చి ఘటనాస్థలిని పరిశీలించారు. యస్ రాయవరం పోలీసులు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేపట్టారు.

Akhand Bhoomi News

error: Content is protected !!