ములగపూడి లో వైఎస్ షర్మిళ రచ్చ బండ.

 

నాతవరం పిబ్రవరి10 (అఖండ భూమి)

నాతవరం మండలం ములగ పూడి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మీసాల సుబ్బన్న ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వై ఎస్ షర్మిళ హాజరయ్యారు. ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. పలువురు మహిళలు అర్హత ఉన్నా ఇళ్ల స్థలాలు, పెన్షన్లు, ప్రభుత్వ పథకాలు రాలేదని షర్మిల దృష్టికి తీసుకువెళ్లారు.ఈ సందర్భంగా వైయస్ షర్మిల మాట్లాడుతూ ఇప్పటి పాలకులు ప్రజా సంక్షేమాన్ని విస్మరించి, దోచుకోవడం దాచుకోవడమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారని ఆమె అన్నారు. ప్రత్యేక హోదా కోసం ఎంపీ లతో రాజీనామా చేయించి కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పి ఓట్లు అడిగిన వ్యక్తులు తమ ఎంపీలతో ఎందుకు రాజీనామా చేయించలేదని ఆమె ప్రశ్నించారు. కనీసం హోదా కోసం మాట్లాడకపోవడం సిగ్గుచేటన్నారు. పోలవరం ప్రాజెక్టు, రాజధాని, విశాఖ కారిడార్, విశాఖ రైల్వే జోన్, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, చిన్న తరహా పరిశ్రమలు లేకపోవడం వలన యువత వలస వెళ్ళే పరిస్థితి ఏర్పడిందని వైఎస్ షర్మిళ అన్నారు. కల్తీ మద్యం సరఫరా వలన మధ్యతరగతి ప్రజలు మరణిస్తున్నారని సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానన్న ప్రభుత్వమే మద్యాన్ని విక్రయించి డబ్బులు చేసుకుంటుందని ఆమె దుయ్యబట్టారు. ఎన్నికల ముందు ప్రతి ఏటా డిఎస్సీ అని చెప్పి 5 సంవత్సరాలు గడిచిన తరువాత ఎన్నికల ముందు మెగా డీఎస్సీ అని ప్రకటించి ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తుందని ఆమె అన్నారు లక్షల మంది బీఈడీ విద్యార్థుల వయోపరిమితి దాటి అనర్హులు గా మారారని వారికి ప్రభుత్వామే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రుత్తల శ్రీరామ్మూర్తి, రాష్ట్ర జనరల్ సెక్రటరీ బొడ్డు శ్రీనివాసరావు, అనకాపల్లి జిల్లా అధ్యక్షులు మాజీ ఎంపి పల్లం రాజు, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు అనకాపల్లి జిల్లా మహిళా అధ్యక్షురాలు ఉలబాల సూర్యకుమారి, నాతవరం నాయకులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింతల సన్యాసిరావు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!