తాండవ రిజర్వాయర్ గేట్ల మరమ్మత్తుల కోసం జనసేన పార్టీ తరపున లక్ష రూపాయలు ఇస్తాం…

–  జనసేన పార్టీ నర్సీపట్నం ఇంచార్జ్ రాజాన సూర్య చంద్ర

నర్సీపట్నం అసెంబ్లీ నియోజక వర్గంలో జనసేన పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా అనునిత్యం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ఆ సమస్యలపై గళమెత్తి పరిష్కార మార్గాలను చూపే దిశగా కృషి చేస్తున్న జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇంచార్జ్ రాజాన సూర్యచంద్ర రైతుల పక్షాన తాండవ రిజర్వాయర్ గేట్ల మరమ్మత్తులు చేపట్టమని ప్రభుత్వ అధికారులకు విజ్ఞప్తి చేయగా, వారి నిర్లక్ష్య వైఖరి దృష్ట్యా రైతుల సమస్యను పట్టించుకోని పక్షంలో దీక్ష చేస్తానని హెచ్చరించారు.
అన్నట్లుగానే శనివారం నర్సీపట్నం ఆర్డిఓ కార్యాలయం ఎదుట జనసేన పార్టీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన దీక్షలు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గేట్ల మరమ్మత్తులు చేపట్టాలని ఎన్నో సార్లు ప్రభుత్వ దృష్టికి వివిధ రూపాల్లో తెలియజేశామన్నారు. ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడంతో ఇటీవల వర్షాభావ పరిస్థితుల్లో సుమారు 28 వేల ఎకరాల వరకు వంట పొట్ట దశలో ఎండిపోయిన పరిస్థితి ఉందన్నారు. స్థానిక శాసనసభ్యులు కనీసం గేట్ల మరమ్మత్తులపై ఎటువంటి దృష్టిసారించకపోవడం దారుణమన్నారు. కనీసం 7 లక్షలు కేటాయించలేని దుర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నారని ఎద్దేవా చేశారు. తాండవ గేట్ల మరమ్మత్తులు చేపట్టేందుకు రైతుల పక్షాన జనసేన ఎప్పుడూ పోరాడుతుందని స్పష్టం చేశారు. వచ్చే పంట కాలంలో రైతులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు తక్షణమే 7లక్షల గ్రాంటు విడుదల చేసి మరమ్మత్తులు పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. జనసేన పార్టీ తరపున లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించారు. మిగిలిన 6లక్షలు కేటాయించి త్వరితగతిన గేట్ల మరమ్మత్తులు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఆకలి తీర్చే రైతున్నల కష్టాలను తీర్చేందుకు జనసేన పార్టీ కృషి చేస్తుందని ఈ మరమ్మత్తులు చేపట్టేంత వరకు రైతుల పక్షాన నిలిచి ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాతవరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు వెలగల వెంకటరమణ, ఉత్తరాంధ్ర ప్రచార కమిటీ అధ్యక్షులు అద్దేపల్లి గణేష్, నర్సీపట్నం రూరల్ అధ్యక్షులు మోపాడ చిరంజీవి, కిరణ్, కర్రి సంతోష్,నమ్మి కొండలరావు, బోయిన చిరంజీవి, మారిశెట్టి రాజా, చిట్టిబాబు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!