జనసేన,టిడిపి ఉమ్మడి అభ్యర్థినిగెలిపించుకుందాం

జనసేన పార్టీ కోటనందూరు మండల అధ్యక్షులు

పెదపాత్రుని శ్రీనివాస్….

తుని నియోజకవర్గం లో జనసేన, టిడిపి పొత్తులో భాగంగా ప్రకటించిన ఉమ్మడి అభ్యర్థి గెలుపునకు ఇరు పార్టీల కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని జనసేన పార్టీ కోటనందూరు మండల అధ్యక్షులు పెదపాత్రుని శ్రీనివాస్ అన్నారు. వైసిపి గెలిచిన తర్వాత నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమని, రోడ్ల పరిస్థితి దౌర్భాగ్య స్థితిలో ఉందని ఆయన అన్నారు. అంతేకాకుండా అనేక అక్రమ కేసులు, దౌర్జన్యాలు, అక్రమాలు, సహజ వనరుల దోపిడీలు పెరిగిపోవడమే కాకుండా ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛను సైతం హరించి నియంతృత్వ పాలన చేస్తున్నారని, ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన తెలిపారు. గడచిన నాలుగేళ్లలో గ్రామాలలోని డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణాలను సైతం గాలికి వదిలేశారని దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. సంక్షేమ పథకాల పేరిట ప్రజలను మోసం చేస్తూ నిత్యవసర వస్తువుల ధరలు పెరిగి ఆకాశాన్నంటడంతో సామాన్యులు లబోదిబోమని గుండెలు బాదుకుని ఏడుస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా నియోజకవర్గంలోని జనసేన పార్టీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులైన అనేకమంది యువత జనసేన లోకి వచ్చి చేరుతున్నారని ఆయన తెలియజేశారు. వచ్చే ఎన్నికలలో ప్రజాస్వామ్య బద్ద పాలనకై జనసేన, తెలుగుదేశం పార్టీలను గెలిపించుకోవలసిన అవసరం రాష్ట్ర ప్రజలకు ఉందని అందుకోసం జనసేన, తెలుగుదేశం పార్టీల ఉమ్మడి మేనిఫెస్టోను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని కార్యకర్తలను ఆయన కోరారు.

Akhand Bhoomi News

error: Content is protected !!