దోర్నాల శ్రీశైలం గాట్ రోడ్లో ఘోర ప్రమాదం.. పెద్ద దోర్నాల

 

 

దోర్నాల శ్రీశైలం గాట్ రోడ్లో ఘోర ప్రమాదం.. పెద్ద దోర్నాల ఫిబ్రవరి 23( అఖండ భూమి): శ్రీశైలం డోర్నాల ఘాట్ రోడ్ లోని బోడే నాయక్ తండ సబ్స్టేషన్ వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది చింతల నుంచి పెద్దబొమ్మలాపురానికి వెళుతున్న మిర్చి కూలీల ఆటోను వెనుక నుంచి వచ్చిన లారీ ఢీ కొట్టింది సమాచారం అందుకున్న 108 సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను దోర్నాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ప్రమాదంలో 20 మందికి పైగా చింతలగూడానికి చెందిన గిరిజనులు ప్రయాణించగా వారిలో భూమిని అంకమ్మకి ఎడమ చేయి ఇరగగా, లక్ష్మి కి కుడికాలు విరిగింది, శ్రీరాములు మల్లికాకు చేతులు విరిగాయి. మిగతా వాళ్ళకి స్వల్ప గాయాలు అయ్యాయి కొంతమందిని మెరుగైన వైద్యం కోసం మార్కాపురం తరలించారు

Akhand Bhoomi News

error: Content is protected !!