గిద్దలూరు లో హాండ్స్ ఆఫ్ కంపాషన్ ఆధ్వర్యంలో హెచ్ఐవి

 

 

గిద్దలూరు లో హాండ్స్ ఆఫ్ కంపాషన్ ఆధ్వర్యంలో హెచ్ఐవి ఎయిడ్స్ గురించి కళాజాత..! గిద్దలూరు ఫిబ్రవరి 23( అఖండ భూమి): గిద్దలూరు లో రాచర్ల గేట్ సెంటర్ నందు హాండ్స్ ఆఫ్ కంపాషన్ మార్కాపురం వారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వారి ఆదేశాల మేరకు శ్రీ విఘ్నేశ్వర కళాబృందం చే వివిధ కళారూపాలలో హెచ్ఐవి(హ్యూమన్ ఇమినో డెఫిషియన్సీ వైరస్) మరియు ఎస్టిఐ(సెక్సువల్ ట్రాన్స్మిషన్ ఇన్ఫెక్షన్) అనే వ్యాధులు ఏ విధంగా వస్తాయో ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. కళాజాత సందర్భంగా హెచ్,ఓ,సి, ప్రోగ్రాం మేనేజర్ కె,ఐజక్ బాబు మాట్లాడుతూ హెచ్ఐవి అనేది నాలుగు విధాలుగా ఒకరి నుండి మరొకరికి సముక్రమిస్తుందని వివరిస్తూ. కలుషిత రక్త మారిపిడి వలన, కలుషిత సూదులు సిరంజిల వలన, సురక్షితముగాని లైంగిక సంబంధాల వలన, హెచ్ఐవి ఉన్న తల్లి నుండి పుట్టబోయే బిడ్డకు సంక్రమిస్తుందని ఆయన అన్నారు. హెచ్ ఓ సి అవుట్ రిచ్ వర్కర్, కే. ప్రసన్న దీపిక మాట్లాడుతూ హెచ్ఐవి అంటువ్యాధి కాదని అంటించుకునే వ్యాధి అని ఇది దోమ కాటు వలన కలిసి జీవించుటవలన సాధారణ ముద్దువలన ఈ వ్యాధి రాదని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు గవర్నమెంట్ హాస్పిటల్ ఐసీటీసీ కౌన్సిలర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సుఖ వ్యాధులు అనేవి రెండు రెండు రకాలని చెప్పారు, కంటికి కనిపించేవి, కoటీకి కనిపించనివి, రెండు రకాలని ఆయన చెప్పడం జరిగింది,పొత్తికడుపులో నొప్పి, వర్మాoగాలపైన పొక్కులు గుల్లలు గజ్జలలో మే దుపులు, ఈ వ్యాధులు సెక్సువల్ యాక్టివిటీస్ ద్వారా సంక్రమిస్తాయనిఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఐ సి టి సి కార్తిక్ హెచ్ఓసి సిబ్బంది రిబ్కా రాణి,,S. నాగమణి (చైల్డ్ ఫండ్ ఇండియా),భవాని తదితరులు పాల్గొన్నారు, స్థానిక ప్రజలు విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది

Akhand Bhoomi News

error: Content is protected !!