మహిళల రుణం తీర్చుకోలేనిది.

 

 

మహిళల రుణం తీర్చుకోలేనిది.

కామారెడ్డి: ప్రతినిధి మార్చి 8 (అఖండ భూమి) :మీ రుణం తీర్చుకోలేనిదని సోనియాశంకర్ ఫౌండేషన్ వైస్ చైర్మన్ సోనియా శంకరును ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మగ్గం వర్క్ శిక్షణ తీసుకుంటున్న మహిళలు శాలువా కప్పి, పూల బోకే అందించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ తమ వద్ద ఎలాంటి శిక్షణ ఫీజు తీసుకోకుండా ఉచితంగా ఎంత ఓర్పుతో తమకు మగ్గం వర్క్ శిక్షణ, టైలరింగ్ శిక్షణ ఇస్తున్న నేర్పుతున్న సోనియాను ఎప్పటికీ మర్చిపోలేమన్నారు. గత 27 సంవత్సరాలుగా ఎంతోమందిని సోనియా శంకర్ ఫౌండేషన్ లో టైలరింగ్ మగ్గం వర్క్ శిక్షణ తీసుకొని తమ ఇంటి వద్ద బట్టలు కొడుతూ మగ్గం వర్క్ చేస్తూ తమ కుటుంబాన్ని పోషించుకుంటున్నామని, తమ కుటుంబానికి ఆర్థికంగా తమ వంతు సహకారం చేసుకుంటున్నమన్నారు. సోనియా గొప్ప మానవతావాది అని, ఈ శిక్షణలో ఇవ్వడమే కాకుండా చలికాలంలో పేదలకు, వృద్ధాశ్రమంలో ఉండే వృద్ధులకు దుప్పట్లను పంపిణీ చేస్తూ ఆమె తమ దయార్థ హృదయాన్ని చాటుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ ప్రణీత, ఆర్ అంజలి, ఏ తరుణి, ఏ శృతి, జి సౌమ్య, ఆర్ భవ్య, ఎం పూజ, ఎం రమ్య, డి సుకన్య, డి శిరీష తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!