పసుపు జెండాలతో హోరెత్తిన ‘అల్లిపూడి’

తుని అసెంబ్లీ నియోజకవర్గం కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు గాడి రాజబాబు ఆధ్వర్యంలో “మీ ఇంటికి మీ దివ్య” కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిలు గా యనమల దివ్య, యనమల శివరామకృష్ణన్, చోడిశెట్టి గణేష్ లు హాజరయ్యారు. ఈ కార్యక్రమం అశేష జనవాహిని మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలు, మాజీ మంత్రివర్యులు యనమల రామకృష్ణుడు గ్రామానికి చేసిన మేలులను, అభివృద్ధి కార్యక్రమాలను యనమల దివ్య కు వివరిస్తూ మంగళ హారతులతో బ్రహ్మరథం పట్టారు. ప్రజలందరికీ “బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ” పేదల కోసం ప్రవేశ పెట్టిన సూపర్ సిక్స్ పథకాలను గూర్చి వివరిస్తూ కరపత్రాలను అందిస్తూ ముందుకు సాగారు.

అంతేకాకుండా దివ్య మాట్లాడుతూ అల్లిపూడిని అభివృద్ధి పథంలో నడిపిస్తానని గ్రామం అనేక సమస్యల వలయం లో ఉందని వాటన్నింటినీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కాకినాడ పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షులు యనమల శివరామకృష్ణన్ మాట్లాడుతూ ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తుకు గ్యారెంటీ ఇస్తూ తెలుగుదేశం పార్టీ పేదల కోసం అనేక పథకాలు ఇస్తుందని వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అల్లిపూడి గ్రామ నాయకులు అంకంరెడ్డి బుల్లిబాబు మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో అల్లిపూడి లో తెలుగుదేశం పార్టీని అఖండ మెజారిటీ ఓట్లతో గెలిపిస్తామని తెలుగుదేశం పార్టీ గెలుపు తధ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గ్రామంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలిపారు. మాజీ ఎంపిటిసి రుత్తల శ్రీనివాస్ మాట్లాడుతూ అల్లిపూడి లో ప్రజలు అధికార పార్టీ అన్యాయాల పట్ల విసిగెత్తి పోయారని వైసీపీని ఓడించేందుకు ప్రజల కంకణం కట్టుకుని సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. జనసేన పార్టీ మండల అధ్యక్షులు పెదపాత్రుని శ్రీనివాస్ మాట్లాడుతూ కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పార్టీ గెలుపుకు కృషి చేయాలని తెలుగుదేశం జనసేన పార్టీ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మోతుకూరి వెంకటేష్, సుర్ల లోవరాజు, మాజీ ఎంపీపీ చిరంజీవి రాజు, అంకం రెడ్డి నానబ్బాయి, అంకం రెడ్డి రమేష్, బొంటుపల్లి వెంకటేశ్వరరావు, పెనుమత్స నాగేశ్వరరావు, వెలగా వెంకటకృష్ణ రావు, పెద పాత్రుని శ్రీనివాస్, చింతకాయల కొండబాబు, చింతకాయల సురేష్, రుత్తల సత్య సీతయ్య, కొండ్రు కళ్యాణ్, నెమ్మాది సత్యనారాయణ, ముప్పిడి జమీలు, చిట్టుమూరి జమీలు తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News