నాతవరం లో ఘనంగా “శంఖారావం”

ముఖ్య అతిథిగా హాజరైన “అయ్యన్న” 

నాతవరం మార్చి 10 (అఖండ భూమి)

 

నాతవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన శంఖారావం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు హాజరయ్యారు. నాతవరం బస్టాండ్ లో గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు అర్పించారు. అనంతరం కార్యకర్తలతో కలిసి ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపులో అభిమానులు, కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు. మహిళలు మంగళహారతుల తో తెలుగుదేశానికి “జై” కొట్టారు “బాబుష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ” పత్రాలను పంచుతూ పథకాలను గూర్చి ప్రజలకు వివరించారు. అనంతరం రామాలయం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ కి ప్రత్యేక హోదా తెస్తామని మాయ మాటలు చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని నేటికీ ప్రత్యేక హోదా రాలేదని అంతే కాకుండా రైల్వే జోన్ తీసుకురాలేదని విమర్శించారు. రాజధాని లేని ఏకైక రాష్ట్రం మన రాష్ట్రమేనని ఆయన ఎద్దేవా చేశారు. ఉద్యోగులకు సిపిఎస్ రద్దు చేస్తానని ఉద్యోగుల్ని డీఎస్సీ ఇస్తానని నిరుద్యోగులను నిండా మోసం చేశారని విమర్శించారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి గత ప్రభుత్వంలో ఇస్తే దానిని తొలగించారని వారు ఉద్యోగాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. పెన్షన్ ను మాజీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు 200 నుండి 2000 చేశారని జగన్మోహన్ రెడ్డి 3000 ఇస్తానని చెప్పి సంవత్సరానికి 250 రూపాయలు చొప్పున పెంచుతూ పెన్షన్ దారులను ఘోరంగా మోసం చేశారని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి నేతల విజయ్ కుమార్, మండల పార్టీ అధ్యక్షులు వెంకటరమణ, మాజీ ఎంపిటీసి బంగారు సూరిబాబు రైతు సంఘం అధ్యక్షలు పైల సూరిబాబు, ఈసంశెట్టి సీతారాం, బిసి సెల్ అధ్యక్షులు పారుపల్లి రమణ, గ్రామ పార్టీ అధ్యక్షులు శెట్టి నానాజీ, మాజీ ఎంపిటీసి అప్పిరెడ్డి మాణిక్యం, కొండ్రు మరిడయ్య, మాజీ ఎంపిపి సన్యాసి దేముడు, లాలం అబ్బారావు, జిరెడ్డి రాజుబాబు, శెట్టిసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News