కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామంలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ నగర్ లో డ్రైనేజ్ కాలువలు, సిమెంట్ రోడ్ల నిర్మాణం చేపట్టక పోవడంతో గృహాల నుంచి విడుదలయ్యే నీరు, డ్రైనేజ్ కాలువలు లేకపోవడంతో రోడ్లపైనే నిల్వ ఉండి పోతుందని, మట్టి రోడ్లు కావడం తో అవి అధ్వాన్నంగా తయారవుతున్నాయని సోషల్ యాక్టివిస్ట్ కొండ్రు కళ్యాణ్ అన్నారు. ప్రజలు తమ ఇంటికి వెళ్ళే దారిలో మురికి నీరు నిల్వ ఉండడం తో రాక పోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. నీరు నిల్వ ఉండి మురికి నీరు గా మారి దోమల వృద్ధి రేటు పెరిగి అనేక వ్యాధులను వ్యాప్తి చేస్తున్నాయని దీనివలన ప్రజలు మలేరియా, టైఫాయిడ్ లాంటి అనేక వ్యాధులు బారిన పడి తీవ్ర అస్వస్థతకు గురౌతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. గ్రామంలో పారిశుద్ధ్య పనుల పై అధికారులు దృష్టి సారించాలని అంతే కాకుండా డ్రైనేజ్ కాలువలు నిర్మాణం చేపట్టాలని ఆయన కోరారు.
ANDHRA BREAKING NEWS HEALTH NEWS PAPER POLITICS STATE