ఆ ఇద్దరు బుకీపరులు సస్పెండ్.. ఎన్నికల నియమావళి ఉల్లంఘించినందుకు చర్యలు
కర్నూలు బ్యూరో మార్చి 29 (అఖండ భూమి) : ఎన్నికల నియమావళి ఉల్లంఘన జరిగినందుకు చెరుకులపాడు గ్రామానికి చెందిన ఇద్దరు బుక్కీపరులపై చర్యలు తీసుకొని సస్పెండ్ ఆదేశించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. బుధవారం వెల్దుర్తి లో వైఎస్ఆర్సిపి ప్రెస్ మీట్ లో చెరుకులపాడు పంచాయతీకి చెందిన ఇద్దరు బుక్కు కీపర్లు పాల్గొన్నారని చెరుకులపాడు గ్రామానికి చెందిన పార్వతయ్య తహసిల్దార్ అనంతాచారి కి ఫిర్యాదు చేయడం జరిగింది. సుధాకర్, రంగడు అనే బుక్ కీపర్లు ఎన్నికల కోడ్ కు విరుద్ధంగా పాల్గొన్నారు అని తహసిల్దార్ కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఇందులో భాగంగా వైకెపి డిఆర్డిఏ ఎన్నికల నియమావళి క్రమశిక్షణలో భాగంగా వీరిద్దరిని విధుల నుండి తొలగించినట్లు తహసిల్దార్ అనంతాచారి తెలిపారు.
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..