నాతవరం మండలం గునుపూడి లో భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డా బాబా సాహెబ్ అంబేడ్కర్ జయంతి ని గ్రామ యువ నాయకులు బోసి రాజు గ్రామ యువకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సామాజిక కార్యకర్త సింగంపల్లి గోవింద్ మరియు చిటికెల రాణి ముఖ్య అతిథిలు గా హజరయ్యారు. అంబేద్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి దేశానికి, సమాజానికి బాబా సాహెబ్ అంబేద్కర్ చేసిన సేవలు గుర్తు చేశారు. ఈ సందర్భంగా గోవింద్ మాట్లాడుతూ ప్రపంచ మేధావి డా బాబా సాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్ర నేటి యువతకు ఆదర్శమని ఆయన గూర్చి ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. అంతే కాకుండా ఆయన మేధస్సు పట్ల ప్రపంచ దేశాలే గర్విస్తున్నాయని ఈనాటి రిజర్వ్ బ్యాంక్ ఆయన కృషి ఫలితమేనని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం లో బోసి కృష్ణ మూర్తి, కొండ్రు లోవరాజు, నాగేశ్వరరావు, ముక్కుడు పల్లి ప్రసాద్, నిండుగొండ ప్రకాష్, దారా నూకరాజు,విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
You may also like
మన ఓటు – మన రాజ్యం నినాదం తో దళితుల రక్షణ – రాజ్యాధికారం సాధన . దళిత బహుజన పార్టీ అధినేత: కృష్ణ స్వరూప్
కాకినాడలో ఘోరం: భరత్ నందన్ ప్రేమ వంచనకు నర్సు ప్రమీల బలి.. ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్డ్ హత్యే: నిందితుడిని ఉరితీయాలని బంధువుల డిమాండ్!
అమెరికాలో శ్రీ శ్రీ కళావేదిక విస్తరణకు అడుగులు
క్రీడలకు కార్పొరేట్ ప్రోత్సాహం.. సోనస్ క్రికెట్ లీగ్-2026 కప్ ఆవిష్కరణ
బ్రేకింగ్: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్.. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం!


