నర్సీపట్నం అసెంబ్లీ నియోజక వర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గా మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు నామినేషన్ ను దాఖలు చేసారు. ఈ సందర్భంగా ఆయన తన స్వగృహం నుంచి ఆర్డిఓ కార్యాలయం వరకు కార్యకర్తలతో భారీ ర్యాలీగా తరలివచ్చి తమ నామినేషన్ దాఖలు చేశారు. అంతేకాకుండా ఆయన కార్యకర్తలను, ప్రజలను ఉద్దేశించి అయ్యప్ప స్వామి ఆలయం వద్ద ప్రచార వాహనం ఆపి మాట్లాడుతూ మీపై నమ్మకంతో మీ సమక్షంలోనే ఈ నామినేషన్ పత్రాలు పై సంతకం చేస్తున్నానని చెప్పి సంతకం చేసారు. కార్యకర్తలు, ప్రజలు ఆనందోత్సవాలతో కరచాల ధ్వనులతో సంఘీభావం తెలిపారు. ఆ తరువాత అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ సుస్థిరమైన పాలనకై అనకాపల్లి పార్లమెంట్ బిజెపి అభ్యర్థి సీఎం రమేష్ ను గెలిపించాలని కార్యకర్తలను, ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బోలెం ముత్యాల పాప , మాజీ ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు, అనకాపల్లి పార్లమెంట్ బిజెపి అభ్యర్థి సిఎం రమేష్ పలు గ్రామాల కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు పాల్గొన్నారు.