(నర్సీపట్నం)
నియోజకవర్గ సీనియర్ నాయకుడు రుత్తల యర్రాపాత్రుడు వైసీపీలో చేరారు. నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేశ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా యర్రపాత్రుడికి జగన్మోహన్ రెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఆయనతో పాటు పాపయ్య పాలెం సర్పంచ్ కూడా వైసీపీలో చేరారు. నర్సీపట్నం మున్సిపాలిటీ మాజీ వైస్ ఛైర్మన్ సీహెచ్ సన్యాసి పాత్రుడు, డాక్టర్ లక్ష్మీకాంత్ తదితరులు పాల్గొన్నారు.