పసుపు జన సంద్రమైన కోటనందూరు… పోటెత్తిన అల్లిపూడి తెలుగు తమ్ముళ్లు

 

(కోటనందూరు మండలం).

కోటనందూరు మండలం సోమవారం పసుపు జెండాలతో పసుపు జన సంద్రమైంది. తునిలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి యనమల దివ్య నామినేషన్ కార్యక్రమం జరుగుతుండడంతో అల్లిపూడి నుండి తెలుగు దేశం పార్టీ కోటనందూరు మండల యువ నాయకులు అంకంరెడ్డి బుల్లిబాబు ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో ర్యాలీగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు పోటెత్తడం తో ట్రాఫిక్ స్తంభించిపోయింది. కనుచూపుమేర పసుపు జెండాలతో హోరెత్తి పసుపుమయమవ్వడం తో కార్యకర్తలు “జై బుల్లిబాబు”” జై తెలుగుదేశం” జై జనసేన” నినాదాలు చేశారు.

నిలిచిన బస్సులు, ఆటోలలో నుంచి టిడిపి, జనసేన అభిమానులు “జై తెలుగుదేశం, జై జనసేన” నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు చింతకాయల కొండ బాబు మాట్లాడుతూ ఒకప్పటి తెలుగుదేశం పార్టీ అడ్డాగా ఉన్న అల్లిపూడి, తెలుగుదేశం పార్టీ మండల యువ నాయకులు అంకంరెడ్డి బుల్లిబాబు ఆధ్వర్యంలో మరల పూర్వవైభవం దిశగా దూసుకుపోతుందని తెలిపారు. అధికారపక్షం అవినీతిని, అక్రమాలను వెలికితీస్తూ ఎప్పటికప్పుడు బహిర్గతం చేస్తూ తెలుగుదేశం పార్టీ గెలుపునకు అహర్నిశలు కృషి చేస్తుండడంతో ఒక్కసారిగా అల్లిపూడి ముఖచిత్రం మారిపోయిందని దీనితో ప్రజలు తెలుగుదేశం పార్టీ బాట పట్టారని ఆయన తెలిపారు. ఆ తరువాత కోటనందూరు నుంచి పోలవరం మీదుగా తుని చేరుకుని యనమల దివ్య నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అభిమానుల కరచాలధ్వనులు, ఆనందోత్సవాల మధ్య యనమల దివ్య నామినేషన్ దాఖలు చేశారు.

Akhand Bhoomi News