గునుపూడి లో వృద్ధురాలి కుటుంబం పై పదిమంది దాడి …

 

నాతవరం మండలం గునుపూడి గ్రామంలో శనివారం రాత్రి బోసి రాములమ్మ అనే వృద్ధురాలు మరియు ఆమె కుటుంబం పై పది మంది గుంపుగా దాడి చేశారు. ఈ దాడిలో వృద్ధురాలు తీవ్రంగా గాయపడటం తో నర్సీపట్నం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం భూమి తగాదా విషయంలో మాట్లాడే విషయమై ముందే వేసుకున్న పథకం ప్రకారం వృద్దురాలను, కుటుంబ సభ్యులను పిలిచి పదిమంది చుట్టుముట్టి మూకుమ్మడి దాడి చేశారని వృద్ధురాలు తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిందని తెలిపారు. గాయపడిన వృద్దురాలను ఆమె కుటుంబికులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారని తెలిపారు. వృద్దిరాలిపై దాడిని పలువురు తీవ్రంగా ఖండిస్తున్నారు.

Akhand Bhoomi News