10వ తరగతి/ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించండి
జిల్లా కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు
నంద్యాల, మే 22 : 10వ తరగతి/ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్ లో 10వ తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు మాట్లాడుతూ 10వ తరగతి పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 24 నుండి వచ్చే నెల 3వ తేదీ వరకు, ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 24వ తేదీ నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు నిర్వహిస్తున్న నేపథ్యంలో సంబంధిత పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుతో పాటు ఫ్లైయింగ్ స్క్వాడ్లకు డీటీలను కేటాయించాలని డిఆర్ఓ ను ఆదేశించారు.అన్ని పరీక్షా కేంద్రాల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్లను ఏర్పాటు చేయాలని డిఎంహెచ్ఓ ను ఆదేశించారు. 10వ తరగతికి సంబంధించి 27 పరీక్షా కేంద్రాలలో 7,748 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు కలెక్టర్ వెల్లడిస్తూ…. పదవ తరగతి పరీక్షలు ప్రతిరోజు ఉదయం 9-30 గంటల నుంచి మధ్యాహ్నం 12-45 గంటల వరకు జరుగుతున్నందున సంబంధిత ప్రదేశాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని మునిసిపల్, పంచాయతీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం సంబంధించి 8,813 మంది జనరల్ విద్యార్థులు, 537 మంది ఒకేషనల్ విద్యార్థులు కలిపి మొత్తం 9,350 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారన్నారు. రెండవ సంవత్సరం సంబంధించి 3,933 మంది జనరల్ విద్యార్థులు, 465 మంది ఒకేషనల్ విద్యార్థులు కలిపి మొత్తం 4,398 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారన్నారు. మొదటి, రెండవ సంవత్సరం కలిపి మొత్తం 13,748 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని తెలిపారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు, మధ్యాహ్నం 02:30 గంటల నుంచి 05:30 గంటల వరకు రెండవ సంవత్సరం పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు బందోబస్తు నిర్వహించాలని పోలీస్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పరీక్ష కేంద్రాలకు వచ్చేందుకు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని, పరీక్ష కేంద్రాల్లో నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని, జిరాక్స్ మిషన్లను మూసి వేయించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో డిఆర్ఓ ఎ. పద్మజ, మునిసిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, డివిఈవో సునీత, డీఈవో సుధాకర్ రెడ్డి, డిఎంహెచ్ఓ డా.వెంకటరమణ, ఏపీఎస్ఆర్టీసీ, ఏపీఎస్పీడీసీఎల్, కార్మిక శాఖ, జిల్లా ఎగ్జామినేషన్ కమిటీ మెంబర్ శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
You may also like
-
ఉత్తమ బి ఎల్ ఓ కి ఉత్తమ గ్రహీత అవార్డు..
-
వృద్ధాశ్రమంలో ఘనంగా సమాచార హక్కు చట్టం సాధన కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు సురా స్రవంతి జన్మదిన వేడుకలు
-
తప్పుడు సర్వే నివేదికలు సమర్పించిన వారిపై చర్యలు తీసుకోవాలి. న్యాయవాది కొండ్రు కళ్యాణ్
-
ఎస్సీల కుల గణన లిస్ట్ లో అన్నీ తప్పులే – అభ్యంతరం తెలియజేసిన ఎస్సీ నాయకులు
-
పూర్తికావస్తున్న అంకాపూర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు..