నేడే వెల్దుర్తి ఎల్లమ్మ తిరుణాల..
కర్నూలు జిల్లా వెల్దుర్తి మండల కేంద్రమైన పట్టణం నందు గ్రామ పెద్దల సమక్షంలో వెల్దుర్తి ఎల్లమ్మ తిరుణాల ఆనవాయితుగా జరుగుతోంది. ఈ ఆలయానికి అర్చకులతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. గ్రామ దేవతకు ప్రతి ఏటా అత్యంత వైభవంగా తిరుణాల మహోత్సవం జరుపుకోవడం విశేషం. నేడు అమ్మవారు ప్రత్యేక అలంకరణలో దర్శనమిస్తారు. ఉదయం అమ్మవారికి ఇంటింటికి బోనాలు సమర్పిస్తారు సాయంత్రం ఐదు గంటలకు రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. గ్రామ పెద్దల సమక్షంలో గ్రామ ప్రజల ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. ఈ రథోత్సవానికి గ్రామం నుండి కాకుండా ఇతర గ్రామాల నుండి వచ్చే మొక్కులు తీర్చుకుంటారు.