శ్రీశైల దేవస్థానంలో సంస్కృతి కార్యక్రమాలు
శ్రీశైలం మే 22 అఖండ భూమి. శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున దేవస్థానంలో బుధవారం దేవస్థానంలో నిర్వహిస్తున్న ధర్మపదంలో భాగంగా నిత్యకళ్యారాధన భాగంగా శ్రీ అభయ ఆంజనేయ స్వామి భజన సంఘం, గుంటూరు వారిచే గుంటూరు వారిచే కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్య కళారాధన వేదిక బుధవారం సాయంకాలం కార్యక్రమం ప్రారంభమైంది.
ఈ కార్యక్రమంలో శ్రీ విఘ్నేశ్వర శివుని కుమార, అభిషేకం చేద్దాం రండి.శివనామమే, శ్రీశైలం మల్లన్న శంభో శంకర. శ్రీగిరి భ్రమరాంబిక మల్లికార్జున స్వామి మొదలైన భక్తి గీతాలను ఆళ్ల అరుణకుమారి, శ్రీనివాస్ రెడ్డి,వెంకట్రత్నం,లక్ష్మీ, వెంకటలక్ష్మి,పద్మావతి వెంకటలక్ష్మి, కుమారి శివ లీల మొదలైన వారుఆలపించారు.
ఈ నిత్య కళారాదంలో ప్రతిరోజు హరికథ,బుర్రకథ, సాంప్రదాయ నృత్యం వాయిద్యాల మధ్య సంగీత భక్తి రంజని కార్యక్రమాలు ఏర్పాటు చేయబడతాయి. శ్రీ స్వామి అమ్మవార్లకు అలా కై కార్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని ప్రాచీన సంప్రదాయ కళ పరిరక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించబడును.