శ్రీశైలం ఆలయ ప్రాంగణంలోని వీరభద్ర స్వామికి విశేష పూజలు…….

 

 

శ్రీశైలం ఆలయ ప్రాంగణంలోని వీరభద్ర స్వామికి విశేష పూజలు…

శ్రీశైలం మే 22 ఆఖండ భూమి ): లోక కళ్యాణం కోసం బుధవారం సాయంకాలం ఆలయ ప్రాంగణంలోని వీరభద్ర స్వామి వారికి విశేష పూజలను నిర్వహిస్తుంది. ఆలయ ప్రాంగణంలోని మల్లికార్జున స్వామి వారి ఆలయానికి ఉత్తర భాగంలో మల్లికా గుండానికి పక్కనే ఉన్న వీరభద్రస్వామి జ్వాలాముకుటంతో పది చేతులతో విశిష్ట రూపంలో దర్శనమిస్తాడు శిల్పశాస్త్ర పరిభాషలో ఈ స్వామికి అగోర వీరభద్ర మూర్తి అని పేరు కూడా ఉంది స్వామివారికి దక్ష ప్రజాపతి కనిపిస్తాడు ఈ స్వామిని పరివార ఆలయాలలో భాగంగా ప్రతినిత్యం పూజించడం జరుగుతోంది కాగా ప్రదోషకాలంలో విశేషాకం కార్యక్రమం దేవస్థానం నిర్వహిస్తుంది. ఈ పూజ వలన లోకశాంతి,దుర్భిక్ష నివారణ, భక్తుల అనుకున్న కోరికలు నెరవేరుతాయి.ముఖ్యంగా క్షేత్ర అభివృద్ధి

 

జరుగుతుంది.కాగా ఈ పూజలలో ముందుగా కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతి పూజను నిర్వహించబడుతుంది.తర్వాత వీరభద్ర స్వామికి పంచామృతాలతోనూ, పలు రకాల ఫలోదకాలతోనూ, గందోదకం, భష్మోదకం, పుష్మోదకం,బిల్వోదకం, హరిద్రోదకం తోను మరియు మల్లికా గుండంలోని శుద్ధ జలంతో విశేషాభిషేకం నిర్వహించడం జరుగుతుంది. ఈ అభిషేకాల తర్వాత విశేషంగా స్వామి వారికి పుష్పార్చనను జరిపించబడుతుందని కార్యనిర్వాహన అధికారి వారు తెలిపారు.

Akhand Bhoomi News