తాళ్లరేవు లైన్స్ క్లబ్ వారు విజయ్ కుమార్ కు ఆర్థిక సాయం.

 

 

తాళ్లరేవు లైన్స్ క్లబ్ వారు విజయ్ కుమార్ కు ఆర్థిక సాయం.

తాళ్ళరేవు(అఖండ భూమి)కాకినాడ జిల్లా తాళ్ళరేవు గ్రామపంచాయతీ రచ్చవారిపేటకు చెందిన రచ్చ విజయ్ కుమార్ పెయింటింగ్ కార్మికునికి పెద్ద కష్టం వచ్చిన విషయం తెలుసుకున్న తాళ్ళరేవు-గొల్లపాలెం లయన్స్ సభ్యులు స్పందించి, అమలాపురం కిమ్స్ హాస్పిటల్ లో లివర్ మరియు క్లోమ వ్యాధులకు చికిత్స పొందుతున్న విజయ్ కుమార్ ఇంటికి వెళ్లి అక్కడ దీన పరిస్థితులను చూసి అతని పేద తల్లిదండ్రులను భార్యను ఓదార్చి, 10,000 పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగినది. రచ్చ విజయ్ కుమార్ మంచి ఆరోగ్యంతో తిరిగి రావాలని లయన్స్ జిల్లా గవర్నర్ వేలూరి సూర్యనారాయణ అన్నారు, ఈ కార్యక్రమంలో ఆయన వెంట నున్న దత్తు, బిళ్ళకుర్తి శ్రీనివాస రెడ్డి, సామా భగవాన్, పొన్నాడ పేరయ్య రాజు, కట్టా అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News