ప్రభుత్వ కాలేజీల్లో చదివే ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం
ప్రభుత్వ కాలేజీల్లో చదివే ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు
నోడల్ ఆఫీసర్ నియామకం తెలుగు అకాడమీ నుంచి టెక్ట్స్ బుక్స్, నోట్ బుక్స్, బ్యాగులు సరఫరా ఏపీలో కొత్త ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది. తాజాగా, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివే ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వ శుభవార్త చెప్పింది. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయనున్నట్టు ప్రకటించింది. ప్రభుత్వ కాలేజీలతో పాటు కేజీబీవీలు, ఏపీ మోడల్ స్కూళ్లు, ఏపీ గురుకుల పాఠశాలలు, హైస్కూల్ ప్లస్ లలో చదివే విద్యార్థులకు ఉచితంగా టెక్ట్స్ బుక్ లు పంపిణీ చేయనున్నారు.సమగ్ర శిక్షా రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ ను ఈ ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ పథకానికి నోడల్ ఆఫీసర్ గా నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, టెక్ట్స్ బుక్స్ తో పాటు నోట్ బుక్ లు, బ్యాగ్ లను తెలుగు అకాడమీ నుంచి సరఫరా చేయనున్నారు.
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..