సెల్ ఫోన్ మాయలో పడుతున్న చిన్నారులు.

సెల్ ఫోన్ మాయలో పడుతున్న చిన్నారులు.

సెల్ఫోన్ ఇస్తేనే అన్నం…స్నానం… ఇంకేదైనా..

చరవాణి మోజులో చిన్నపిల్లలు

 

 

యర్రగొండపాలెం (అఖండ భూమి) నేటి సమాజంలో సెల్ ఫోన్ అనేది నిత్యవసర వస్తు అయిపోయింది. కానీ దీనివల్ల కొంతమంది అంటే యువత చరవాణి మాయలో పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇంకొంతమందికి ఉద్యోగం రిత్యా చరవాణి అనేది చాలా ఉపయోగపడుతుంది. చిన్నపిల్లలు సెల్ ఫోన్ మాయ లో పడి పాఠశాలకు కూడాపోనీ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తల్లిదండ్రులు అన్నం తినిపించే సమయంలో సెల్ ఫోన్ కోసం పిల్లలు ఏడుస్తున్నారు. ఫోను చేతికి ఇవ్వకపోతే తినను అని మారం చేస్తున్నారు. చివరికి పిల్లల తల్లిదండ్రులు ఏమి చేయలేక ఫోను చేతిలో పెడుతున్నా రు. అప్పుడు ఆ పిల్లలు ఫోన్ చేతిలో పట్టుకొని ఏవో బొమ్మలు చూస్తూ తల్లి తినిపిస్తుంటే నవ్వుతూ అన్నం తింటున్నారు. పిల్లలకు స్నానం చేపించే ముందు కూడా ఫోన్ ఇస్తేనే స్నానం చేస్తాను అనే పరిస్థితిలు ఏర్పడుతున్నాయి. బయట తమ తోటి వారి పిల్లలతో ఆటలాడుకోవడం తక్కువ అయిపోయింది. సెల్

ఫోన్ లో ఆడుకోవడం ఎక్కువైపోయింది. బోరులో పడ్డ పిల్లాడిన కాపాడుకోగలుగుతున్నాము కానీ సెల్ ఫోన్ మాయలో పడ్డ పిల్లలను కాపాడుకోలేకపోతున్నాం నేటి సమాజం ఎటు వెళు తున్నదో తెలి యని పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలను సెల్ ఫోన్ కు దూరంగా ఉంచండి. ఈ సెల్ ఫోన్ వలన రేడియేష న కు గురియై పిల్లలు అనారోగ్య పరిస్థితులకు గురవుతున్నారు. పిల్లల భవిష్యత్తును కాపాడుకుం దాం, సెల్ ఫోన్ నుండి దూరం ఉంచుదాం. బోరు బావిలో పడ్డ పిల్లలలైన కాపాడుకోవచ్చు… కానీ, సెల్ ఫోన్లో పడ్డ పిల్లలను కాపాడుకోలేకపోతున్నాం అని పలువురు తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. పిల్లలతో ఏ పని చేపించాలన్నా సెల్ఫోన్ ఇస్తేనే చేస్తున్నామంటున్నారు. ఆఖరికి బాత్రూమ్ పోవాలన్నా సెల్ఫోన్ చూస్తూ పోతున్నారు… ఇదే దోరణి కొనసాగితే పిల్లల బంగారు భవష్యత్తు ప్రమాదంలో పడే అవకాశాలే ఎక్కువ అని పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!