నేడు ఎల్లారెడ్డి క్యాంపు కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించిన ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ :

నేడు ఎల్లారెడ్డి క్యాంపు కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించిన ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ :

 

కామారెడ్డి ప్రతినిధి: జూన్ 18 (అఖండ భూమి) కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో గవర్నమెంట్ ఆసుపత్రి ని ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది.
ఆసుపత్రి లో ఓ పి రిజిస్టర్ ను పరిశీలించారు..
రోగులతో ముచ్చటించి ఆసుపత్రి లో గల సౌకర్యలను, ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
ఆసుపత్రి లో నాణ్యమైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఎటువంటి సమస్య ఉన్న నా దృష్టికి తీసుకురావాలన్నారు.
అనంతరం క్యాంపు కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు.
నియోజకవర్గం లో ఎటువంటి అవినీతి జరిగిన సహించలేదు. ఎవరు అవినీతికి పాల్పడిన వెంటనే తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
నియోజకవర్గంలో 36 కోట్లు కొత్తగా రోడ్లు మరియి బ్రిడ్జి ల నిర్మాణం కొరకు మంజూరు చేయడం జరిగింది.
మారుముల గ్రామాలకు కూడా రవాణా సౌకర్యం కల్పించాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్నామన్నారు.
అధికారులతో కో ఆర్డినేషన్ మీటింగ్ షెడ్యూలుని విడుదల చేసారు. మండలాలలో ఏవైనా సమస్యలు ఉన్న ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావాలన్నారు.
అధికారులతో మాట్లాడి వెంటనే సమస్య పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Akhand Bhoomi News