అర్జునా ఫల్గుణా అని ఉరిమి నప్పుడు ఎందుకు అంటారు.?
కవి,లెక్చరర్ ఉమాశేషారావు వైద్య
కామారెడ్డి జిల్లా బ్యూరో జూలై 27,(అఖండ భూమి)ప్పిడుగులు పడుతున్నప్పుడు ‘అర్జునా ఫాల్గుణ’ అని ఎందు కు జపించాలి? అసలు ఫాల్గు ణ అనే నామానికి అర్థం ఏమి టి?పాండవులు తమ అజ్ఞాత వాస సమయంలోవిరాటమహా రాజు కొలువులో పలురకాల వృత్తులలో ఉంటూ అక్కడే బస చేశారని మీకు తెలిసిన దే.అర్జునుడు విరాట మహా రాజు కూతురికి నాట్య శిక్షకు డిగా వ్యవహరిస్తూ తన పేరుని బృహన్నలగా చెప్పుకుంటాడు పాండవులు ఎక్కడ ఉన్నది తెలుసుకున్న కౌరవులు వారి అజ్ఞాతవాసాన్ని భంగం చేసేం దుకు విరాటరాజురాజ్యం పై దాడికి దిగుతారు.అప్పుడు అర్జునుడు రాజకుమారుడైన ఉత్తరకుమారుడి రథానికి రథసారధిగా వ్యవహరిస్తాడు.
అయితే కౌరవులు లక్షల్లో ఉండ టంతో వారి భారీ సైన్యాన్ని చూ ప్సి పరుగులు తీస్తాడు రాజకు మారుడు.రాజకుమారుడికి ధైర్యం చెప్పిన అర్జును డు తన అసలు పేరు చెప్పి శమీ వృక్షంపై దాచిన ఆయుధాలను తీసుకు రమ్మని చెబుతాడు.
అయితే భయంతో వణికిపో తున్న రాజకుమారుడు అర్జు ను డి మాటను నమ్మడు.
నువ్వు నిజంగానే అర్జునుడివి అయితే నీకున్న ఎన్నో నామా లలో కొన్ని నామాలకు అర్థాలు చెప్పమంటాడు.అర్జునుడికి కిరీటి, సవ్యసాచి, ఫాల్గుణ, పార్థ, విజయుడు ఇలా ఎన్నో నామాలు ఉంటాయి.ఒకదాని తరవాత ఒకటి, అర్జునుడు తన నామాల వెనక ఉన్న పర మార్థాన్ని చెబుతూ ఉంటాడు.
గాండీవాన్ని రెండు చేతులతో వాడగల సామర్థ్యం ఉంది. కాబట్టి తనని సవ్యసాచి అంటారని, ఎంతటి వీరుడి నైనా ఓడించగల బలం ఉండ డం వల్ల విజయుడు అంటా రని, దేవేంద్రుడు బహుమా నంగా ఇచ్చిన కిరీటాన్ని ధరించడం వలన కిరిటి అని అంటారని, కుంతీ దేవి అసలు పేరు పృథ, ఆమెకు జన్మించ డం వలన పార్ధ అంటారని, ఇక ఉత్తర ఫల్గునీ నక్షత్రం మరియు పూర్వ పాల్గొని నక్షత్రాల సంధి కాలంలో జన్మించడం వల్ల తన ని ఫాల్గుణ అంటారని అర్జును డు తన నామాలకు అర్ధాలు చెప్పి తానే అర్జునుడినని ఉత్తర కుమారుడిని నమ్మి స్తాడు.ఆ నక్షత్రాల సంధికా లంలో జన్మించడం వలన అర్జునుడు పిడుగులని అదు పు చేయగలడని, పిడుగులు పడుతున్నప్పుడు అర్జునుడిని ఫాల్గుణ నామంతో మననం చేసుకుంటే పిడుగులు పడటం ఆగుతుందని, అలాగే ధైర్యం వస్తుందని పెద్దలు చెబుతారు.
.