ప్రభుత్వం వసతి గృహాలపై చిన్నచూపు. — ఖలీల్

 

 

ప్రభుత్వం వసతి గృహాలపై చిన్నచూపు. — ఖలీల్

కామారెడ్డి జిల్లా బ్యూరో జులై 28 (అఖండ భూమి):

ప్రభుత్వం వసతి గృహాలపై చిన్న చూపు చూస్తుందని

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కామరెడ్డి శాఖ జిల్లా హాస్టల్ కన్వీనర్ ఖలీల్ అన్నారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా హాస్టల్ కన్వీనర్ ఖలీల్ మాట్లాడుతూ

జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్ టి, బిసీ, మైనార్టీ సంక్షేమ హాస్టల్లలో సరైన వసతులు లేక మెనూ ప్రకారం భోజనం అందక విద్యార్థుల అవస్థలు పడుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం పేరుకుమాత్రాన సన్న బియ్యం అందిస్తున్నామని చెప్పిడం జరుగుతుందని వాపోయారు. కానీ హాస్టల్లో పాలిష్ చేసిన బియ్యం ఇస్తున్నా, కనీసం ప్రహరీ గోడలు లేక సరైనటువంటి వస్తువులు లేక తగిన రూమ్స్ లేక విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఇది ఇలా ఉంటే హాస్టల్ వార్డెన్లు మాత్రం సమయపాలన పాటించకుండా వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు రావడం వెళ్ళడం విద్యార్థులు అందుబాటులో లేకపోవడం కామారెడ్డి జిల్లాలో వార్డెన్ల తీరిది. ప్రభుత్వం ఇచ్చిన మెనూ ప్రకారం భోజనం పెట్టనట్టు పరిస్థితి వార్డెన్ లదీ. వెంటనే జిల్లాలో ఉన్నటువంటి హాస్టల్ సమస్యలను నెరవేర్చాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుందన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!