హోలియ దాసరి ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు
కామారెడ్డి జిల్లా బ్యూరో జులై 28 (అఖండ భూమి):
ఆషాడ మాసం పురస్కరించుకొని చివరి రోజైన ఆదివారం కామారెడ్డి కేంద్రంలోని దేవునిపల్లిలోని 35 వార్డులో హాలియ దాసరి కాలనీవాసులు బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. బోనాల పండుగ సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున బోనాలను ముత్యాల పోచమ్మ, మదన పోచమ్మ, భూలక్ష్మమ్మ, బద్ది పోచమ్మ, కు ఘనంగా బోనాలను సమర్పించి, మహిళలు అమ్మవార్లకు పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి మొక్కలు తీర్చుకున్నారు. బోనాల ఊరేగింపులో మంగళ వాయిద్యాలు డప్పులు, డోల్లు తదితర వాటితో దేవునిపల్లిలో బోనాలను భారీగా ఊరేగించి అమ్మవార్లకు సమర్పించారు. పిల్లాపాపలు, పాడిపంటలుపండి, ప్రజలందరూ చల్లంగా ఉండాలని వేడుకున్నారు. ప్రతి ఏటా బోనాల పండుగ నిర్వహించడం జరుగుతుందని, ఈ సాంప్రదాయం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యుడు బి. రాజు పాటిల్, హొలియా దాసరి సంఘం ప్రతినిధులు చిన్న పోచయ్య, చిన్న నరసింహులు, శ్రీరామ్ గంగయ్య, చిన్న నల్ల పోచయ్య, సుధిన బోయిన రాములు, ఎస్. పెద్ద సాయిలు, టంటం ముత్తయ్య, పెద్ద ఉప్పు నర్సింలు, నరేందర్, ఎస్ లక్ష్మణ్ హోలీయ దాసరి సంఘం వారు పాల్గొన్నారు.
You may also like
-
కబ్జా చేస్తున్న చెక్కిళ్ల శ్రీనివాస్
-
రాక్స్ రాష్ట్ర కార్యదర్శిగా న్యాయవాది కొండ్రు కళ్యాణ్ నియామకం
-
ఆప్కాబ్ గిడ్డంగులను పరిశీలించిన అదికారులు సంతృప్తి వ్యక్తం చేసిన డిసీసీబి, నాబార్డు అదికారులు
-
ఆ పార్టీలను భూస్థాపితం చేయాలి: రాక్స్ అధినేత డాక్టర్ రత్నాకర్
-
రైతు సమస్యల పరిష్కార వేదికగా రీ సర్వే గ్రామసభ.