దేశ ప్రధాని మాదిగలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి 

 

 

దేశ ప్రధాని మాదిగలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి

ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలి

ఆగస్టు 6న ఢిల్లీలో వంగపల్లి దీక్షను విజయవంతం చేయాలి

సూర్యాపేట,జులై 28,(అఖండ భూమి): కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని మాదిగలకు హామీలు ఇచ్చి మోసం చేసిందని ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించే దేశ ప్రధాని మాదిగలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా అధ్యక్షులు బచ్చలకూరి నాగరాజు మాదిగ, సూర్యాపేట నియోజకవర్గం ఇన్చార్జి బొజ్జ పరశురాములు మాదిగలు డిమాండ్ చేశారు.

 

ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం స్థానిక ఖమ్మం క్రాస్ రోడ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆగస్టు 6న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించే వంగపల్లి దీక్ష కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం మౌనం వీడి మాదిగ మాదిగ ఉపకులాలకు తగిన న్యాయం చేయాలన్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్న నాటకాలను మాదిగ జాతి గమనిస్తుందని ఈ విషయంలో క్షమించేది లేదన్నారు. ఎన్నికల ముందు ఎస్సీ వర్గీకరణ చేస్తామంటూ హామీలు ఇచ్చి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చి మాదిగలను మరవడం సరికాదన్నారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ నడివీధిలో డప్పు కొట్టి దండోరా వేసి వర్గీకరణ డిమాండ్ ను ఎలుగెత్తి చాటడానికి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద చేపడుతున్న దీక్షకు మాదిగలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కోదాడ నియోజకవర్గ ఇన్చార్జి పోలంపల్లి శ్రీనివాస్, పిడమర్తి సంపత్, పిడమర్తి శ్రీకాంత్, శివ, ప్రేమ్ కుమార్, బి రాజు, గణేష్, సన్నీ, కనుకు ప్రవీణ్, చాగంటి మురారి, రోహిత్, డి వెంకటరమణ, ఓగ్గు మంజు, డైరీ, మామిడి దుర్గాప్రసాద్, పిడమర్తి సన్నీ, మహేష్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!