పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి

 

పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి

-టాస్క్ ఫోర్స్ పోలీసులకు ఎలా సమాచారం అందుతుంది

-ఆర్మూర్ పోలీసులకు సమాచారం రావడం లేదు..?

-గత నెల 29న. మామిడిపల్లిలో టాస్క్ ఫోర్స్ పోలీసులే దాడి

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి ఆగస్టు: 06(అఖండ భూమి) నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పరిధి కోటర్మూర్ లో సిపి కల్మేశ్వర్ ఆదేశాల మేరకు. సీఐ పురుషోత్తం ఆధ్వర్యంలో పేకాట స్థావరంపై నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం దాడి చేసి 8 మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకొని. 8 సెల్ఫోన్లను.67.440 రూపాయలను స్వాధీనం చేసుకుని ఆర్మూర్
ఎస్ హెచ్ ఓ కు అప్పగించారు. గత నెల 29న. మామిడిపల్లిలో కూడా పేకాట స్థావరంపై నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులే దాడి చేసి పలువురిని అదుపులోకి తీసుకొని ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. తరచు టాస్క్ ఫోర్స్ పోలీసులే పేకాట స్థావరాలపై దాడులు చేయడం ఆర్మూర్ పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. నిజామాబాద్ లో ఉన్న టాస్క్ ఫోర్స్ వారికి సమాచారం ఎలా అందుతుంది. కూత వేటు దూరంలో ఉన్న ఆర్మూర్ పోలీసులకు సమాచారం ఎందుకు అందడం లేదు. ఇది నమ్మశక్యంగా లేదని పట్టణ ప్రజలు అనుమానిస్తున్నారు. ఇప్పటికైనా ఆర్మూర్ పోలీసులు టాస్క్ ఫోర్స్ పోలీసుల కంటే ముందే ఆర్మూర్ పోలీసులు సమాచారం తెలుసుకొని పేకాట స్థావరాలపై దాడులు చేస్తే బాగుంటుందని పట్టణ ప్రజలు చెప్పుకుంటున్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!