భర్తకు దేహశుద్ధి చేయించిన భార్య
-మరో మహిళతో అక్రమ సంబంధం ఉందని అనుమానం
-చెప్పులు కర్రలతో భర్త.. మహిళపై మహిళా సంఘాల దాడులు
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి ఆగస్టు: 08(అఖండ భూమి) నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం వెల్మల్ వ్యక్తికి దేగాం నర్సరీలో పనిచేసే మరో మహిళతో అక్రమ సంబంధం ఉందని అనుమానపడిన భార్య మహిళా సంఘాలను ఆశ్రయించడంతో గత మూడు రోజుల క్రితం ఆలూర్ మండలంలోని దేగాం గ్రామ నర్సరీలో పనిచేసే మహిళను భార్య. మహిళా సంఘాల సభ్యులు కలిసి జుట్టు పట్టి దారుణంగా కొట్టారు. వెలుమల్లో ఉన్న భర్తకు ఫోన్ చేసి దేగాం కు రావాలని చెప్పడంతో భర్త దేగాం కు వచ్చాడు. అతనిపై భార్య మహిళ సంఘాల సభ్యులు చెప్పులు. కర్రలతో దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భర్తను కారులో మరో ప్రదేశానికి తీసుకువెళ్లి చిత్రవధ చేసినట్లు తెలిసింది. భార్య భర్తపై నందిపేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దాడి చేసిన ఘటన దేగాం గ్రామంలో జరిగింది. ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది కాబట్టి బాధితుడు ఓ ప్రజా ప్రతినిధి సహకారంతో ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. నర్సరీలో పని చేసే మహిళతో తనకు ఎలాంటి అక్రమ సంబంధం లేదని చెప్పినా వినకుండా భార్య. మహిళా సంఘం సభ్యులు దేగాం గ్రామానికి పిలిపించి తనపై దాడి చేశారని. మహిళా సంఘాలు చట్టాన్ని వారి చేతుల్లోకి ఎలా తీసుకుంటారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. విచారణ కోసం ఎస్ హెచ్ ఓ రవికుమార్ దేగాంలో విచారిస్తున్నట్లు తెలిసింది.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



