మహాత్మ జ్యోతిబా పూలే ఆంధ్ర ప్రదేశ్ బి.సి సంక్షేమ గురుకుల పాఠశాల లో పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్. ఎం. సి) ఎన్నికలు గురువారం నిర్వహించారు. కమిటీ ఛైర్మన్ గా పైల శ్రీను, వైస్ చైర్మన్ గా శ్రీమతి కొండ్రు రవణమ్మ ను విద్యార్ధుల తల్లిదండ్రులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ పి. శ్రీను మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి తోడ్పడుతానని తెలిపారు. పాఠశాల వైస్ చైర్మన్ రవణమ్మ మాట్లాడుతూ ఈ పాఠశాల అన్ని ఫలితాలలో జిల్లాలోనే మొదటి స్థానంలో ఉండాలని దానికి తగ్గట్టుగా బోధించాలని ఉపాధ్యాయులను కోరారు. అంతేకాకుండా పాఠశాల సమస్యల పరిష్కారం కొరకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. పాఠశాల ప్రిన్సిపాల్ ఎన్నికైన వారందరికీ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, ప్రిన్సిపాల్ పి.యజ్ఞ విశ్వ శాంతి, ఉపాధ్యాయులు గణేష్, రంగనాథ్, నజీర్, మూర్తి, రాజశేఖర్, వెంకట్, కృష్ణ మరియు బోధనేతర సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
You may also like
-
బడిఈడు పిల్లలు బడిలోనే ఉండాలి
-
కూల్ డ్రింక్ షాప్ లో నకిలీ మద్యం స్వాధీనం..వ్యక్తి అరెస్ట్
-
ఆదాయ వనరుల పెంపుపై స్థానిక సంస్థలు దృష్టి సారించాలి…
-
బ్రోకర్లు ను నమ్మి మోసపోవద్దని వన్ టౌన్ సీఐ వర ప్రసాద్ హెచ్చరిక
-
శ్రీశైలం దేవస్థానం దర్శనార్థం వచ్చే భక్తులు బ్రోకర్లు నమ్మి మోసపోవద్దని టూ టౌన్ హెచ్చరిక హెచ్చరిక