శంఖవరం: (అఖండభూమి)
శంఖవరం మండలం తాహసీల్దార్ గా ఎస్.పోతురాజు సోమవారం బాధ్యతలు స్వీకరించారు.తాళ్లరేవు మండలం తాహసీల్దార్ గా పని చేస్తూ ఎన్నికల విధులు నిమిత్తం ఏలూరు జిల్లా కైకలూరు మండలం లో తహశీల్దార్ గా బదిలీ పై వెళ్లారు.అదే ప్రాంతంలో ఎన్నికలకు నిమిత్తం అసిస్టెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి గా పని చేశారు. ఎన్నికల అనంతరం తన సొంత జిల్లా అయినా కాకినాడ జిల్లా పెద్దాపురం డివిజన్ పరిధిలోగల శంఖవరం మండలం తాహాసిల్దార్ గా నియమితులయ్యారు.సోమవారం బాధ్యతలు స్వీకరించడానికి వచ్చిన తాహాసిల్దార్ ఎస్ పోతురాజుకు కార్యాలయ సిబ్బంది, వి.ఆర్.ఒ లు, గ్రామ సర్వేయర్ లు పుష్పగుచ్ఛంలు ఇచ్చి తాహసీల్దార్ కు స్వాగతం పలికారు. ఎన్నికల నిమిత్తం శంఖవరం బదిలీపై వచ్చిన రాజకుమారి కృష్ణాజిల్లా బదిలీపై వెళ్లారు.
You may also like
-
అనుమానాస్పద స్థితిలో ఇద్దరు మైనర్లు మృతి..!
-
శ్రీ లక్ష్మీ దేవి అమ్మవారి వార్షికోత్సవం లో పాల్గొన్న మాజీ ఎంపీపీ లోయపల్లి నర్సింగరావు.
-
ఉద్యోగ భద్రత కల్పించాలి అంటూ నిరసన తెలిపిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్..
-
గ్యాస్ వంటలు మాకొద్దు కట్టెల పొయ్య్ వంటలే మాకు ముద్దు
-
తరువాత కలిగిన నిరుపేద కుటుంబాలు ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో చేర్చాలి..!