వెల్దుర్తి క్రిష్ణగిరి ఆగస్టు 12 (అఖండ భూమి) :
రాష్ట్రవ్యాప్తంగా స్కీమ్ వర్కర్లకు సంబంధించిన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని అధికారులకు తెలిపారు.
ఏఐటియుసి అనుసంధానమైన అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ప్రతి మండలంలో ఎమ్మార్వో కి వినతి పత్రాలు ఇవ్వాలని రాష్ట్ర అధ్యక్షురాలు జే లలితమ్మ ఆధ్వర్యంలో వెల్దుర్తి ఎమ్మార్వో కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా క్రిష్ణగిరి మండలంలో జి.రజనీ దేవి ఆధ్వర్యంలో ఎమ్మార్వో కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
జే లలితమ్మ మాట్లాడుతూ గత 48 సంవత్సరాల నుండి గ్రామాల పట్టణాల పేద బడుగు బలహీన వర్గాల తల్లులకు పిల్లలకు సేవల ఉద్దేశాలు నెరవేర్చే దిశలో. అతి తక్కువ గౌరవేతనాలతో పనిచేస్తున్నప్పటికీ ప్రభుత్వం మా శ్రమని గుర్తించడం లేదు తగిన వేతనం ఇవ్వడం లేదు. 42 రోజుల సమ్మె సందర్భంగా గత ప్రభుత్వం ఒప్పుకున్న హామీలు వేతనాల పెంపు ఇతర సమస్యలను హామీలను తక్షణమేపరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. కనీసం వేతనం 26000 ఇవ్వాలి . మినీ సెంటర్ మెయిన్ సెంటర్ గా చేయాలని. రేషన్ షాప్ లో ప్రాబ్లంస్ అన్ని పరిష్కరించి సకాలంలో సెంటర్లో సరుకులు చేరివేయాలని. వర్కర్స్ హెల్పర్స్ ఖాళీలు ఎప్పటికప్పుడు భర్తీ చేయాలి ప్రభుత్వం మా న్యాయమైన కోరికల్ని వెంటనే తీర్చాలని కోరడమైనది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఏఐటీయూసీ మండల అధ్యక్షుడు బి. మాధవస్వామి వెల్దుర్తి మండలం ఈదమ్మ వరలక్ష్మి రేణుక సాలమ్మ క్రిష్ణగిరి మండలంలో గంగాభవాని వెంకట లచ్చమ్మ మహేశ్వరి మహాదేవమ్మ ఆదిలక్ష్మి సుజాత.మొదలగు వారు పాల్గొన్నారు.
You may also like
అప్రెంటిస్షిప్ చట్టం ప్రకారం వేతనం తప్పనిసరి.. హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షులు:- నారాయుడు
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్