మత్తు పదార్థాలకు బానిసలు కాకూడదు. అఖండ భూమి-యర్రగొండపాలెం

 

మత్తు పదార్థాలకు బానిసతలు కాకూడదని ఎంఈవో-2 మల్లూ నాయక్, ఏఎస్సై మూర్తి తెలిపారు. మంగళవారం డ్రగ్స్ ఫ్రీ ఇండియా క్యాంపెయిన్లో భాగంగా సార్డ్స్ సంస్థ ఆధ్వర్యంలో యర్రగొండపాలెం పట్టణంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు వి పిచ్చిరావు అధ్యక్షతన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు, యువత మత్తు పదార్దాల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. వాటిని సేవించడం వల్ల అనారోగ్యం పాలవుతారని చెప్పారు. మత్తు పదార్ధాల పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పారు. అనంతరం మానవహారం చేశారు. విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో పి అంజనేయులు, సార్ట్స్ బాల ప్రకాశం ఏపిఎం మందా ముఇయబాబు, ఉపాధ్యాయులు షేక్ సాధిక్, బాల ప్రకాశం సిబ్బంది శేసి, సుప్రియ తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!