అఖండ భూమి-యర్రగొండపాలెం పోస్టాఫీసుకు వచ్చే ప్రజలకు సిబ్బంది జవాబుదారీగా వ్యవహరించాలని తపాల ఇన్స్సెక్టర్ పీ మదన్ మోహన్ అన్నారు. మంగళవారం యర్రగొండపాలెంలోని పోస్టాఫీసుకు తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తపాలా సేవింగ్ ఖాతాలు, తపాల జీవిత భీమా పధకాలు, ఇండియా పోస్టు పేమెంట్స్ బ్యాంకు సేవలు ప్రజలకు అందించాలని తెలిపారు. వాటి పట్ల అవగాహన కల్పించాలని సూచించారు. పోస్టాఫీసుకు వచ్చిన ఖాతాదారులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సంధర్భంగా కొందరు ఆర్టీ పుస్తకాలు లేవని తెలపడంతో వెంటనే అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో మొయిల్ వర్సెస్ ఐ శంకర్ ప్రసాద్, సబ్ పోస్టు మాస్టర్ కె కొండా నాయక్, పోస్టు మ్యాన్లు కమల్ అహమ్మద్ కోటయ్య తదితరులు పాల్గొన్నారు.
You may also like
మన ఓటు – మన రాజ్యం నినాదం తో దళితుల రక్షణ – రాజ్యాధికారం సాధన . దళిత బహుజన పార్టీ అధినేత: కృష్ణ స్వరూప్
కాకినాడలో ఘోరం: భరత్ నందన్ ప్రేమ వంచనకు నర్సు ప్రమీల బలి.. ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్డ్ హత్యే: నిందితుడిని ఉరితీయాలని బంధువుల డిమాండ్!
అమెరికాలో శ్రీ శ్రీ కళావేదిక విస్తరణకు అడుగులు
క్రీడలకు కార్పొరేట్ ప్రోత్సాహం.. సోనస్ క్రికెట్ లీగ్-2026 కప్ ఆవిష్కరణ
బ్రేకింగ్: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్.. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం!


