యానం(అఖండ భూమి)విద్యాశాఖలో పారా టీచర్స్ గా పనిచేస్తున్న ఉద్యోగుల కి శాశ్వత పరిష్కారం చేసి వారికి రెగ్యులర్ పద్ధతిలో తీసుకోవాలని, మిల్క్ బాయిలర్ కి 18000 పెంచుతున్ననట్లు గత అసెంబ్లీ సమావేశాల్లో తెలపడం జరిగిందని కానీ ఇప్పటికీ వారికి ఎలాంటి జీతాలు పెంచలేదని ప్రభుత్వం తక్షణమే స్పందించి వారికి జీతాలు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని,యానంలో ఆరోగ్య శాఖ కోసం ఎంత చెప్పినా తక్కువేనని ఆసుపత్రి లో సిబ్బంది పనితీరు చాలా దారుణంగా ఉందని కేవలం పోస్టుమార్టం చేయడానికి తప్ప ఎందుకు ఉపయోగంలేదని అధికారులు రోగులకు ప్రతీ-చిన్న అత్యవసర పరిస్థితి వచ్చిన కానీ కనీసం వైద్యం అందడం లేదని చనిపోయిన మనిషిని భద్రపరచడానికి ఫ్రీజర్ బాక్స్ కూడా లేని పరిస్థితిలో ఉంటే గతంలో యానంలో కొంత మంది నాయకులు మరియు యువత ధర్నాలు చేస్తే ఫ్రీజర్ బాక్స్ వచ్చే పరిస్థితిలో యానం ఆసుపత్రి ఉందని, యానాంకి 900 కిలోమీటర్లు దూరంలో ఉన్న పుదుచ్చేరిలో ఉన్న అధికారులకు -నాయకులకు యానం ప్రజాసమస్యలు ప్రభుత్వానికి కనపడటం లేదని గతంలో ఆరోగ్య మంత్రిగా ఉన్న రాజకీయ నాయకులు ఆ శాఖను ఏ-రకంగా కూడా ప్రజలకి ఉపయోగం లేకుండా చేశారని ఇప్పటికీ ఆయుష్మాన్ భారత్ అమలు కాకపోవడం వల్ల పేదవారు డబ్బు ఖర్చు చేసి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేసుకునే పరిస్థితి వచ్చిందని,వారికి కేవలం ఒక ఎమ్మెల్యేగా కాకుండా మానవత్వం ఉన్న వ్యక్తులుగా వారికి ఆరోగ్యం కోసం ఎంతో కొంత సాయం చేస్తున్నానని,ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధచూపి మెరుగైన వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గొల్లపల్లి కోరారు.యానంలో ఉన్న పురపాలక శాఖలో పనిచేస్తున్న అనేకమంది సిబ్బందికి క్రమబద్ధంగా జీతాలు చెల్లింపు లేకపోవడం వల్ల వారు అనేక ఇబ్బందులు గురవుతున్నారని ప్రతీ 8 నెలలకు ఒకసారి జీతాలు మంజూరు చేస్తే వారి యొక్క జీవన విధానం ఏ-విధంగా ఉంటుందని తద్వారా వారు అనేక ఆర్థిక ఇబ్బందులు కుటుంబ సమస్యలు ఆరోగ్య ఇబ్బందులు కూడా పడుతున్నారని ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వారికి క్రమం తప్పకుండా జీతాలు ఇచ్చే విధంగా కృషి చేయాలని ఎమ్మెల్యే గొల్లపల్లి కోరారు. పురపాలకశాఖలో ఎమ్మెల్యే నిధులు మరియు ఎంపీ నిధులు అదేవిధంగా నామినేటెడ్ ఎమ్మెల్యే ద్వారా కొన్ని కోట్ల రూపాయలు అభివృద్ధి పనులకు కేటాయించినప్పటికీ పూర్తిస్థాయిలో ఇప్పటివరకు కూడా ఏ ఒక్క పనికూడా పూర్తిగా ముందుకు వెళ్లడం లేదని పి.సి.ఎస్ కేడర్ గల అధికారిని నియమించాలని, అదేశాఖలో పనిచేస్తున్న వారిని కాకుండా పుదుచ్చేరి నుంచి జూనియర్ ఇంజనీర్ నియమించాలని తద్వారా అభివృద్ధి పనులు వేగవంతం చేయడానికి అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే గొల్లపల్లి తెలిపారు. ప్రభుత్వం స్పందించి పి. సి.ఎస్ అధికారిని నియమించాలని డిమాండ్ చేశారు.
యానంలో వివిధ శాఖల లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బందికి క్రమబద్ధంగా జీతాలు మంజూరు చేయకపోవడం పట్ల వారు అనేక ఆర్థిక ఇబ్బందులు గురవుతున్నారని వారికి కుటుంభపోషణ చాలా కష్టంగా ఉంటుందని పలువురు తనకు విజ్ఞప్తి చేశారని ప్రభుత్వం వారికి క్రమబద్ధంగా జీతాలు చెల్లించే విధంగా కృషి చేయాలని కోరారు. ఆరోగ్యశాఖ- విద్యాశాఖ-రెవెన్యూ ఇతర శాఖలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్న పోస్టులను రిక్రూట్మెంట్ చేసి యువతకు ఉద్యోగ అవకాశం కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.యానంలో ఉన్న దేవాలయం కమిటీ వారు శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి వారి ఆభరణాలు ఇంతవరకు ఎక్కడున్నాయో తెలపకుండా కాలయాపన చేస్తున్నారని మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసినా కానీ అధికారులు కనీసం వీటిపై స్పందన లేకపోవడం పట్ల ప్రభుత్వ ఉద్దేశం ఏంటని ఇదే కొనసాగితే తిరిగి కంటెంట్ ఆఫ్ కోర్టుకి వెళ్లవలసి ఉంటుందని ఎమ్మెల్యే గొల్లపల్లి తెలిపారు.ప్రభుత్వం దీనిపై శ్రద్ధచూపి ఒక స్పెషల్ అధికారిని నియమించి దేవుడు యొక్క ఆభరణాలు ప్రజలకు చూపించాలని యానం ప్రజల తరఫునుండి డిమాండ్ చేసినట్లు ఎమ్మెల్యే గొల్లపల్లి తెలిపారు.ప్రజాపనుల శాఖలో 2005 సంవత్సరం నుండి పనిచేస్తున్న ఎఫ్.టి.సి.ఎల్ ఆర్ లు సుమారు 126 మంది ని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా ఎన్.ఎం.ఆర్ గా పనిచేస్తున్న వారికి 2022 లో 10వేలు నుండి 18 వేలు జీతం పెంచుతున్నట్లు ప్రభుత్వం తీర్మానించింది కానీ ఇప్పటి వరకు వారికి ఎలాంటి జీతాలు పెంపు జరగలేదని ప్రభుత్వం స్పందించి వారికి జీతాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.అదే శాఖలో పనిచేస్తున్న 2003 సంవత్సరం నుండి 8 మంది ఔట్సోర్సింగ్ సిబ్బందికి కేవలం నెలకు 3200 రూపాయలు ఇస్తున్నారని వారికి ఆ జీతం వారి కుటుంబ పోషణకు ఎంతవరకు లబ్ధి చెందుతుందని ప్రభుత్వం ఎందుకు వారిపై ఇంత నిర్లక్ష్య వైఖరి ఎందుకని ప్రశ్నించారు.పైన పొందుపరిచిన డిమాండ్ల అన్ని కూడా ఈ ఆర్థిక సంవత్సరం లో పూర్తి చేయాలని ఎమ్మెల్యే గొల్లపల్లి డిమాండ్ చేశారు.పుదుచ్చేరి నుండి నాయకులు- అధికారులు యానం నియోజకవర్గానికి 900 కిలోమీటర్ల అవతల ఉన్న కానీ పుట్టినరోజు వేడుకలకు మరియు ఇతర ఫంక్షన్లకు హాజరవుతున్నారు తప్ప నాయకులు మరియు అధికారులు అయ గ్రామాల ప్రజలతో కలిసి ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజా సమస్యల కోసం ఆరా చేస్తే యానంలో ఉన్న సమస్యలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుస్తాయని ముక్తకంఠంతో అసెంబ్లీలో ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస అశోక్ తెలిపారు.
ANDHRA BREAKING NEWS NEWS PAPER POLITICS STATE