సర్వసభ్య సమావేశం జరిగినా? క్యాంప్ శిబిరాల్లో ఉన్న ఎంపీటీసీలు?

 

కొయ్యూరు ( అఖండ భూమి)
అల్లూరి జిల్లా

కొయ్యూరు మండల సర్వసభ్య సమావేశం ఈనెల 14న నిర్వహించడం జరుగుతుందని మండల అభివృద్ధి అధికారి లాలం సీతయ్య ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో శాసనమండలి సభ్యులు ఎన్నిక ఉన్న నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు అరకు నియోజకవర్గాలకు చెందిన ఎంపీటీసీలను జడ్పిటిసి లను వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసినక్యాంపు శిబిరాలకు తరలించారు. ఈ నేపథ్యంలో కొయ్యూరు మండలంలో ఎంపీటీసీలో ఒకరు భారత కమ్యూనిస్టు పార్టీ కి చెందిన ఎంపీటీసీ కాగా మిగిలిన ఎంపీటీసీ లందరూ వైసిపి పార్టీకి చెందినవారే కావడంతో అందరూ ఎంపీటీసీలు ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో ఉన్నారు దీంతో ఎంపీటీసీలు జడ్పిటిసి ఎంపీపీ కూడాఅందుబాటులో లేనందున మండల సర్వసభ్య సమావేశం జరిగే అవకాశం ఉండదని తెలుస్తోంది. సర్వసభ్య సమావేశం ఒకవేళ జరిగిన ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎటువంటి అభివృద్ధి పనులు పై చర్చించేందుకు అవకాశం కూడా ఉండదు. దీంతో మండల సర్వసభ్య సమావేశం జరిగిన తూతూ మంత్రంగానే జరుగుతుందని ఎటువంటి విషయాలు చర్చించకపోవచ్చునే తెలుస్తుంది

Akhand Bhoomi News

error: Content is protected !!